మహేష్ బాబు(Mahesh Babu) – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో ‘అతడు’ (Athadu) ‘ఖలేజా’ (Khaleja) వంటి సినిమాల తర్వాత వచ్చిన చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) . 2024 సంక్రాంతికి భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేదు. ప్రమోషన్స్ సరైన విధంగా చేసి ఆడియన్స్ ని ప్రిపేర్ చేయకపోవడం వల్ల.. ప్రేక్షకులు ‘గుంటూరు కారం’ ని పూర్తి స్థాయిలో ఆదరించలేదు. అయితే సంక్రాంతి పండుగ సెలవులు కలిసొచ్చి..
బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్ట్ చేసింది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై ఎస్.రాధాకృష్ణ(చినబాబు) (S. Radha Krishna) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇదిలా ఉండగా.. థియేటర్స్ లో ‘గుంటూరు కారం’ సోసోగానే ఆడినా ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ నే రాబట్టుకుంది. రిపీట్స్ లో చూసే విధంగా ‘గుంటూరు కారం’ లో కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అందుకే అనుకుంటా.. టీవీల్లో కూడా ఈ చిత్రాన్ని బాగానే వీక్షిస్తున్నారు.
మొదటిసారి ‘గుంటూరు కారం’ టెలికాస్ట్ అయినప్పుడు 9.2 టి.ఆర్.పి రేటింగ్ నమోదైంది. ఓటీటీలు అందుబాటులో ఉండటం వల్ల చాలా మంది ప్రేక్షకులు శాటిలైట్ ఛానల్స్ ని ఎక్కువగా చూడటం లేదు. ఇలాంటి టైంలో కూడా ‘గుంటూరు కారం’ కి 9 టి.ఆర్.పి వచ్చిందంటే చిన్న విషయం కాదు.
విచిత్రంగా రెండోసారి టెలికాస్ట్ లో కూడా ‘గుంటూరు కారం’ కి మంచి టి.ఆర్.పి రేటింగ్ నమోదవ్వడం విశేషంగా చెప్పుకోవాలి.అవును అక్టోబర్ 13 న జెమినీ టీవీలో రెండోసారి టెలికాస్ట్ అయ్యింది ‘గుంటూరు కారం’. రెండో టెలికాస్ట్ లో కూడా ‘గుంటూరు కారం’ 6.13 టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసింది. ఆ రకంగా చూస్తే టీవీల్లో ‘గుంటూరు కారం’ హిట్ సినిమా అనే చెప్పాలి.