Mahesh Babu: మహేష్ బాబు నటించిన ఆ బ్లాక్ బస్టర్ మూవీ సైతం రీరిలీజ్ కానుందా?

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) సినిమాలు రీరిలీజ్ అయితే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వస్తాయని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది. మహేష్ పుట్టినరోజు కానుకగా రీరిలీజ్ అయిన మురారి (Murari) సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఏరియాలలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది. పోకిరి (Pokiri) సినిమా కూడా రీ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మహేష్ బాబు నటించిన అతడు (Athadu) మూవీ కూడా రీరిలీజ్ కానుందని అయితే ఈ సినిమా వచ్చే ఏడాది రీరిలీజ్ అవుతుందని ప్రచారం జరుగుతుంది.

Mahesh Babu:

వైరల్ అవుతున్న వార్తల గురించి అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది. అతడు సినిమా బుల్లితెరపై సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. బుల్లితెరపై 1000 కంటే ఎక్కువసార్లు ప్రదర్శితమైన సినిమాగా ఈ సినిమా రికార్డును సొంతం చేసుకుంది. అతడు సినిమా రీరిలీజ్ అయితే వచ్చే రెస్పాన్స్ మామూలుగా ఉండదు. థియేటర్లలో ఈ సినిమా మరీ సంచలనాలు సృష్టించకపోయినా బుల్లితెరపై మాత్రం చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు.

మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి (S. S. Rajamouli) డైరెక్షన్ లో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మహేష్ ఖలేజా (Khaleja) మూవీ రీరిలీజ్ గురించి వార్తలు వినిపిస్తున్నా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి సినిమాతో పాన్ వరల్డ్ స్థాయిలో సత్తా చాటాలని అభిమానులు భావిస్తున్నారు. రాజమౌళి మహేష్ కాంబో మూవీ కొరకు మరో మూడేళ్లు ఎదురుచూపులు తప్పవు.

మహేష్ (Mahesh Babu) జక్కన్న కాంబో మూవీ 1000 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం. మహేష్ బాబు జక్కన్న కాంబో మూవీకి సంబంధించిన అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయో చూడాలి. ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది.

అక్కినేని శతజయంతి.. అభిమానుల కోసం అదిరిపోయే సినిమాలు రెడీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus