స్ట‌న్నింగ్ లుక్‌లో స‌రైనోడు.. ఆ సినిమా కోస‌మేనా..?

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు ఎంత హ్యాండ్స‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. సీక్రెట్ ఏంటో తెలియ‌దు కానీ వ‌య‌సు పెరుగుతున్న కొద్ది, మ‌హేష్ అందం మాత్రం రోజురోజుకీ పెరుగుతుంది. ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే ఈ మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోకి సంబంధించిన ఒక పిక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. కోవిడ్ కార‌ణంగా షూటింగ్స్ బంద్ కావ‌డం, సినిమా టెన్ష‌న్స్ లాంటివి లేక‌పోవ‌డంతో త‌న ఫ్యామిలీతో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్ళారు మ‌హేష్.

అక్క‌డ త‌న ఫ్యామిలీతో వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తూ, ఎప్పిటిక‌ప్పుడు అప్‌డేట్స్‌ను సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌తిరోజు టూర్‌లో భాగంగా తీసిని ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆయ‌న అభిమానుల‌ను అల‌రిస్తున్నారు. మొద‌ట‌ పిల్లలు సితార అండ్ గౌత‌మ్, భార్య నమ్ర‌త‌తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో హాల్‌చ‌ల్ చేస్తుండ‌గా, తాజాగా నమ్ర‌త త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన పిక్ అదిరిపోయింద‌ని చెప్పొచ్చు. ఎయిర్‌పోర్ట్‌లో త‌ను ఒక్క‌డే సోలోగా దిగిన స్ట‌న్నింగ్ పిక్ ఒక‌టి న‌మ్ర‌త పోస్ట్ చేయ‌గా, సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది.

హూడితో గాగుల్స్ లుక్ పెట్టుకొని దిగిన మ‌హేష్ ఫొటో చాలా స్టైలిష్‌గా ఉంది. దీంతో మ‌హేష్ తాజా లుక్ పై ఆయ‌న‌ అభిమానులు ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు. వ‌య‌సు పెరుగుతున్న కొద్ది, అంద మ‌రింత పెరుగుతుంద‌ని, ఆ సీక్రెట్ ఏంటో చెప్పాల‌ని మ‌హేష్ ఫ్యాన్స్ అడుగుతున్నారు.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. మ‌హేష్ అండ్ డైరెక్ట‌ర్ ప‌ర‌సురామ్ కాంబినేష‌న్‌లో స‌ర్కారు వారి పాట చిత్రం షూటింగ్ మొద‌లుకానుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్‌లుక్ అండ్‌ టైటిల్ మోష‌న్‌ పోస్టన్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేయగానే, ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్‌లో స్పందన లభించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండంగా త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

1

2

3

4

5

6

7

8


Most Recommended Video

ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus