Mahesh Babu: మహేష్.. రాజమౌళి తరువాత ప్రభాస్ దర్శకుడితోనే..!

సూపర్‌స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ప్రస్తుతం రాజమౌళి (S. S. Rajamouli)  దర్శకత్వంలో ‘SSMB29’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ భారీ అడ్వెంచర్ డ్రామా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రియాంకా చోప్రా (Priyanka Chopra)  , పృథ్వీరాజ్ సుకుమారన్  (Prithviraj Sukumaran) కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా 2027లో రిలీజ్ కానుంది. రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడితో పనిచేస్తున్న మహేష్, ఈ ప్రాజెక్ట్‌తో పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించాలని చూస్తున్నారు. కానీ, ఈ సినిమా పూర్తయ్యేలోపే మహేష్ తదుపరి ప్రాజెక్ట్ గురించి హాట్ న్యూస్ వైరల్ అవుతోంది.

Mahesh Babu

‘అర్జున్ రెడ్డి’(Arjun Reddy) ‘యానిమల్’ (Animal) లాంటి సినిమాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) , మహేష్ బాబుతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం. లేటెస్ట్ గా ఇండస్ట్రీలో వస్తున్న సమాచారం ప్రకారం, ‘SSMB29’ తర్వాత మహేష్ వెంటనే సందీప్‌తో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నారట. ఈ కాంబినేషన్ దాదాపు ఖరారైనట్లు ఇన్‌సైడ్ వర్గాలు చెబుతున్నాయి. మహేష్ స్టైలిష్ ఇమేజ్‌తో సందీప్ రా ఎమోషనల్ స్టోరీలు ఎలాంటి మాయాజాలం సృష్టిస్తాయో అనే ఆసక్తి అందరిలో నెలకొంది.

ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌తో (Prabhas)  ‘స్పిరిట్’ (Spirit)  సినిమా తీస్తున్నారు. ఈ సినిమా 2027లో రిలీజ్ కానుంది. ‘స్పిరిట్’ పూర్తయిన వెంటనే మహేష్‌తో కొత్త సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని టాక్. సందీప్ సినిమాల్లోని ఇంటెన్స్ యాక్షన్, ఎమోషనల్ డెప్త్‌తో మహేష్ స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందనే ఊహాగానాలు ఫ్యాన్స్‌లో షురూ అయ్యాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

మహేష్ ఫ్యాన్స్ ఈ వార్తతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ‘SSMB29’తో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న తర్వాత, సందీప్ లాంటి ట్రెండ్‌సెట్టర్ డైరెక్టర్‌తో మహేష్ చేయబోయే సినిమా బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించే అవకాశం ఉంది. ఈ కాంబినేషన్‌పై త్వరలో అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.

100 కోట్లకు చేరువలో సీనియర్ హీరోయిన్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus