టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) తర్వాత రాజమౌళి (S. S. Rajamouli) సినిమాకు కమిట్ అయ్యారు. రాజమౌళితో సినిమా అంటే త్వరగా తెవిలే వ్యవహారం కాదు.. అది పూర్తయ్యేసరికి 3 ఏళ్ళు టైం పట్టేస్తుంది. సో ఈ 3 ఏళ్ళు మహేష్ అభిమానులు తమ అభిమాన హీరో సినిమా కోసం ఎదురు చూడాల్సిందే. అయితే రీ- రిలీజ్..ల ట్రెండ్ అనేది ఒకటి ఉంది కాబట్టి.. వాళ్ళకి ఆ లోటు తెలీడం లేదు.
ఇప్పటికే ‘పోకిరి’ (Pokiri) ‘బిజినెస్ మెన్’ (Businessman) ‘ఒక్కడు’ (Okkadu) ‘మురారి’ (Murari) ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) వంటి సినిమాలు రీ- రిలీజ్ అయ్యాయి. అన్ని సినిమాలు మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాదు కామన్ ఆడియన్స్ కూడా ఎగబడి చూశారు. వాటికి మంచి కలెక్షన్స్ కూడా నమోదవుతున్నాయి. తాజాగా ‘ఒక్కడు’ సినిమాని మరోసారి రీ- రిలీజ్ చేస్తే.. టికెట్లు బాగానే తెగాయి. కొత్త సినిమాలని సైతం చూడటానికి థియేటర్లకు రాని జనం.. మహేష్ బాబు రీ- రిలీజ్ సినిమాలకి వస్తుండటం అనేది ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
అయితే దీనిని తమ స్వార్ధానికి వాడుకోవాలని కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు అత్యాశకి పోతున్నట్టు ఇన్సైడ్ టాక్. ఎలా అంటే… నట్టి కుమార్ వంటి డిస్ట్రిబ్యూటర్ కమ్ నిర్మాత ‘భరత్ అనే నేను’ (Bharat Ane Nenu) సినిమాని రీ- రిలీజ్ చేస్తున్నారు. పదేళ్ల క్రితం వచ్చిన హిట్ సినిమాలు రీ- రిలీజ్ చేస్తే ఒక పద్ధతి. కానీ ‘భరత్ అనే నేను’ వచ్చి ఇంకా 10 ఏళ్ళు పూర్తి కాలేదు.
మరోపక్క మే 31 న ‘అతిథి’ (Athidhi) ‘సైనికుడు’ (Sainikudu) వంటి ప్లాప్ సినిమాలు కూడా రీ- రిలీజ్ చేసుకోవడానికి ఆ సినిమా హక్కులు కొనుగోలు చేసిన వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. ‘ఖలేజా’ (Khaleja) సినిమాని కూడా కృష్ణ జయంతి రోజున రీ- రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమాకి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి పర్వాలేదు. కానీ ‘అతిథి’ ‘సైనికుడు’ వంటి ప్లాప్ సినిమాలు రీ- రిలీజ్ చేయడం అవసరమా? మహేష్ ఫ్యాన్స్ పాకెట్లకి చిల్లులు పెట్టి.. వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకోవడానికి కాకపోతే.. ఏమనుకోవాలి దీన్ని..!