మహేష్ రఫ్ లుక్ కేకగా ఉంది!

మహేష్ నిన్న ఫ్యాన్స్ తో ఓ బిగ్ న్యూస్ పంచుకున్నారు. ఆయన నెక్స్ట్ మూవీపై అధికారిక ప్రకటన చేశారు. గత నాలుగు నెలలుగా మహేష్ అభిమానులలో నెలకొన్న ఉత్కంఠకు తెరదింపుతూ ఆయన 27వ చిత్రం విశేషాలు పంచుకున్నారు. ఇక అందరూ ఊహించిన విధంగానే మహేష్ తన తదుపరి చిత్రం డైరెక్టర్ పరుశురామ్ తో చేస్తున్నారు. కాగా ఈ మూవీపై ఆసక్తికర అప్డేట్ నేడు ఉదయం 9:09 నిమిషాలకు విడుదల చేశారు. ముందుగా ప్రచారం అయినట్టు ఈ మూవీకి సర్కారు వారి పాట అనే టైటిల్ నిర్ణయించారు. చెవికి ఫోగు, మెడపై రూపాయి నాణెం టాటూ తో మహేష్ సరికొత్త లుక్ అదిరింది. మహేష్ ఈ మూవీలో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేస్తున్నారేమో అనిపిస్తుంది.

బ్యాంకింగ్ వ్యవష్టలోని లోపాలు, స్కామ్ లు వంటి విషయాలను ప్రస్తావించేదిగా ఈ మూవీ ఉంటుందని సమాచారం.మహేష్ లుక్ మాత్రం సినిమాపై అనేక అంచనాలు పెంచేస్తుంది. మహేష్ లుక్ పక్కా మాస్ అండ్ రఫ్ అట్టిట్యూడ్ కలిగి ఉండేలా ఉంది. ఆయన తీరు చూస్తుంటే రూపాయి కోసం ఏదైనా చేసే స్వార్ధ పరుడిగా కనిపిస్తాడేమో అనిపిస్తుంది. గతంలో బిజినెస్ మాన్, పోకిరి సినిమాలలో మహేష్ పాత్రలు నెగెటివ్ షేడ్స్ కలిగి ఉంటాయి.

Mahesh Babu's Sarkaru Vaari Paata Movie First Look Review1

సర్కారు వారి పాట మూవీలో కూడా ఆయన పాత్ర నెగెటివ్ షేడ్స్ కలిగి ఉండే సూచనలు కలవు. అలాగే పోకిరి మాదిరి సూపర్ ట్విట్ కలిగి ఉండే అవకాశం కూడా కలదు. మహేష్ లుక్ మాత్రం 90లలోని మాస్ హీరోలను గుర్తు చేసింది. దర్శకుడు పరుశురామ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియి మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ అలాగే 14 రీల్స్ కలిసి నిర్మించనున్నాయి. ఇక మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus