Mahesh Babu, Murugadoss: రూ.100 కోట్ల సినిమాని వదులుకుని.. పోయి పోయి డిజాస్టర్ సినిమా చేశాడు..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు , కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో ‘స్పైడర్’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ‘ఎన్.వి.ఆర్ సినిమా ఎల్ ఎల్ పి’ ‘రిలయన్స్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు.. కలిసి దాదాపు రూ.125 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. 2017 వ సంవత్సరం సెప్టెంబర్ 27 న భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం దారుణమైన డిజాస్టర్ గా మిగిలింది.

మొదటి షోతోనే ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. మహేష్ అభిమానులు కూడా ఈ సినిమాని తిట్టిపోశారు. ‘మహేష్ ఇమేజ్ కి తగ్గట్టు ఈ సినిమా లేదని.. విశాల్ తో చేయాల్సిన మూవీ మహేష్ తో చేసి తమిళ జనాల ముందు మహేష్ ను తక్కువ చేసాడు మురుగదాస్’ అని వారు విమర్శలు గుప్పించారు. బయ్యర్స్ కి కూడా ఈ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. అయితే మహేష్ మాత్రం దర్శకుడు మురుగదాస్ ను ఎప్పటికప్పుడు వెనకేసుకొస్తూనే ఉన్నాడు.

సినిమా ఫలితం ఎలా ఉన్నా.. ‘స్పైడర్’ జర్నీని బాగా ఎంజాయ్ చేసినట్టు ఆయన చెప్పుకొచ్చాడు. ఇది పక్కన పెడితే.. మహేష్ బాబు – మురుగదాస్ కాంబినేషన్లో ‘స్పైడర్’ కంటే ముందే ఓ సూపర్ హిట్ సినిమా రావాల్సి ఉందట. అది మరేదో కాదు ‘తుపాకీ’. అవును ఈ కథని మురుగదాస్.. మహేష్ ను దృష్టిలో పెట్టుకుని రెడీ చేసుకున్నాడట. కానీ ఆ టైంలో మహేష్ కాల్షీట్లు ఖాళీ లేకపోవడంతో విజయ్ తో చేశాడట మురుగదాస్. అప్పటికి విజయ్ కూడా ప్లాపుల్లో ఉన్నాడు.

అతనికి ‘తుపాకీ’ సినిమా మళ్ళీ లైఫ్ ఇచ్చింది అని చెప్పాలి. (Mahesh Babu) మహేష్ కోసం అనుకున్న కథ విజయ్ కెరీర్ కి ఉపయోగపడింది. అదే చిత్రాన్ని మహేష్ తో రీమేక్ చేయాలని మురుగదాస్ ప్రయత్నించాడట. కానీ ‘రీమేక్ సినిమా వద్దు.. మన కాంబినేషన్లో స్ట్రైట్ మూవీ చేస్తేనే బాగుంటుంది’ అని మహేష్ చెప్పడంతో ‘స్పైడర్’ కథ చెప్పాడు మురుగదాస్. ఆ రకంగా హిట్ సినిమాని మిస్ చేసుకుని డిజాస్టర్ సినిమా చేశాడు మహేష్.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus