Mahesh Bbau, Rajamouli: మహేష్ రాజమౌళి మూవీలో విలన్ ఫిక్స్ అయ్యారా?

స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుండగా వచ్చే ఏడాది మహేష్ రాజమౌళి కాంబో మూవీ షూటింగ్ మొదలుకానుంది. త్రివిక్రమ్ సినిమాను వేగంగా పూర్తి చేసి రాజమౌళి సినిమా షూటింగ్ లో పాల్గొనాలని మహేష్ బాబు భావిస్తున్నారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీకి సంబంధించి నటీనటుల ఎంపిక ప్రక్రియ మొదలైందని తెలుస్తోంది. కోలీవుడ్ నటుడు విక్రమ్ మహేష్ రాజమౌళి కాంబో మూవీలో విలన్ గా కనిపించనున్నారు.

అయితే మహేష్ జక్కన్న మూవీలో విక్రమ్ నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ గాసిప్ గురించి స్పందించి స్పష్టత ఇస్తారేమో చూడాల్సి ఉంది. ఈ సినిమాలో విక్రమ్ నిజంగా నటిస్తే సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే మహేష్ జక్కన్న సినిమా కథ ఇప్పటివరకు ఫైనల్ కాలేదు. రాజమౌళి సినిమా నటీనటుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

బాహుబలి సినిమా నుంచి రాజమౌళి తన సినిమాల్లో ఇతర భాషల నటీనటులకు కూడా ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారు. అందువల్ల రాజమౌళి సినిమాలో విక్రమ్ విలన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మహేష్ మూవీ షూటింగ్ ను వేగంగానే పూర్తి చేయాలని రాజమౌళి భావిస్తున్నారు. జక్కన్న సినిమాలో విక్రమ్ విలన్ అంటూ వైరల్ అవుతున్న వార్త గురించి విక్రమ్ క్లారిటీ ఇస్తారేమో చూడాల్సి ఉంది. మహేష్ జక్కన్న కాంబో మూవీకి కేఎల్ నారాయణ నిర్మాత కాగా దాదాపుగా 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus