మహేష్ ప్యాన్స్ ని డిస్సపాయింట్ చేయడట..!

  • January 31, 2021 / 02:33 PM IST

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సర్కార్ వారి పాట షూటింగ్ లో బిజీ అయిపోయాడు. బాబు మొదలుపెట్టడమే ఆలస్యం కానీ, బిగిన్ చేశాక ఫినిష్ చేసేస్తాడు అంటూ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దుబాయ్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ లో హీరోయిన్ తో కొన్ని రొమాంటిక్ లవ్ సీన్స్, అలాగే కొన్ని ఛేజింగ్ సీన్స్, వీటితో పాటుగా రెండు పాటలకి సంబంధించిన షాట్స్ ని కూడా షూట్ చేస్తారట.

ప్రస్తుతం మహేష్ బాబు , కీర్తిసురేష్ ల మధ్య సాగే ప్రేమ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఓ పాటని కూడా ఇక్కడే షూట్ చేయనున్నారని టాక్. ఈ లవ్ సీన్స్ లోనే సాంగ్ లో వచ్చే కిక్ ఉంటుందని అంటున్నారు. ఇది మెలోడి రొమాంటిక్ సాంగ్ అని తెలుస్తోంది. తమన్ ఈసినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఇక బ్యాంకింగ్ సెక్టార్ లో జరిగే అవినితీ మోసాలపై సినిమా కథ సాగుతుందని మహేష్ ఫ్యాన్స్ అస్సలు డిస్సపాయింట్ కారని డైరెక్టర్ పరుశురామ్ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడట.

ఇందులో మహేష్ రెండు విభిన్నమైన క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడు. ఇండియన్ కరెన్సీ రూపాయి చుట్టూనే ఈ సినిమా ఉండబోతున్న సంగతి తెలిసిందే. దుబాయ్ లో షూటింగ్ అనంతంరం హైదరాబాద్ లో కొన్ని కీలకమైన సీన్స్ ని ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత సినిమా షూటింగ్ కొంతపార్ట్ అమెరికాలో ప్లాన్ చేస్తున్నారు. 45రోజుల పాటు అమెరికాలో షూటింగ్ కి స్పెషల్ పర్మీషన్స్ కూడా తీసుకున్నారని అంటున్నారు. ఈసారి ఏది ఏమైనా సంక్రాంతికి మరో సూపర్ డూపర్ హిట్ కొట్టేలాగానే మహేష్ బాబు కనిపిస్తున్నాడు.

Most Recommended Video

30 రోజుల్లో ప్రేమించటం ఎలా? సినిమా రివ్యూ & రేటింగ్!
‘జబర్దస్త్’ కమెడియన్ల రియల్ భార్యల ఫోటోలు వైరల్..!
హీరో, హీరోయిన్ల పెయిర్ మాత్రమే కాదు విలన్ ల పెయిర్ లు కూడా ఆకట్టుకున్న సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus