‘గ్యారేజ్’లో ఆ మూడు సీన్లు కీలకం!!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ‘జనతా గ్యారేజ్’ వరుసగా రెండు హిట్స్ తో మంచి ఊపు మీద ఉన్న ఎన్టీఆర్, మరో పక్క శ్రీమంతుడు సినిమా ఇచ్చిన సక్సెస్ తో దూసుకు మీద ఉన్న దర్శకుడు శివ ఇద్దరూ కలసి ఈ సినిమాకు ఇరగదీస్తున్నారు అన్న టాక్ టాలీవుడ్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మూడు సీన్స్ ప్రేక్షకుల్ని కట్టి పడేస్తాయంట..ఇంతకీ ఏంటి ఆ సీన్స్ అంటే…ముంబై లో చిత్రీకరణ జరుపుకున్న ఎన్టీఆర్ ఇంట్రొడక్షన్ సీన్ ఒకటైతే, ఇక ఆ తరువాత ఒక భారీ ట్విస్ట్ తో ఇంటర్వల్ సీన్ ను హైదరాబ్డ్ లో తెరకెక్కించాడు దర్శకుడు.

అదే క్రమంలో ఇంట్రొడక్షన్ సీన్ అవగానే ఎన్టీఆర్ ను ఐఐటీ స్టూడెంట్ గా చూపించనున్నాడు మన శివ. అయితే ఇక ఆ తరువాత ముఖ్యమైన సీన్ సినిమా క్లైమ్యాక్స్. ఈ సినిమా క్లైమ్యాక్స్ లో భారీ యాక్షన్ సీన్ ను ప్లాన్ చేసుకున్నాడు శివ. అయితే ఆ సీన్ తో పాటు దాదాపుగా కొన్ని ముఖ్యమైన సీన్స్ ను చెన్నైలోని బీచ్ లో పూర్తి చేసే ప్లాన్ లో ఉన్నాడు మన దర్శకుడు. ఇక ఈ షెడ్యూల్ పూర్తి అయితే దాదాపుగా 80శాతం సినిమా పూర్తి అయిపోతుంది అని తెలుస్తుంది. మరి ఇన్ని ట్విస్ట్స్ ఉన్న ఈ సినిమాపై యౌగ్ టైగర్ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మరి వారి అంచనాలను ఈ సినిమా ఎంతవరకూ అందుకుంటుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus