Major, Mahesh Babu: మహేష్ బాబు ఎఫెక్ట్ హిందీలో దారుణంగా మేజర్ కలెక్షన్స్!

శశికిరణ్ తిక్క దర్శకత్వంలో అడవి శేషు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మేజర్.ఈ సినిమా జూన్ మూడవ తేదీ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలో కూడా అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది. ముంబై టెర్రర్ దాడులలో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించిన సంగతి మనకు తెలిసిందే.

ఇక మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి మహేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా అద్భుతమైన వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది.రెండు తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు 6.10 కోట్లు (రూ. 4 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్) వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాలలో అద్భుతమైన కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా హిందీలో మాత్రం పెద్దగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మేజర్ సినిమా మొదటి రోజు రూ. 96 లక్షలు (రూ. 55 లక్షల డిస్ట్రిబ్యూటర్ షేర్) వసూలు చేసింది.

ఈ విధంగా ఈ సినిమా హిందీలో కలెక్షన్లను సాధించలేకపోవడానికి మహేష్ బాబు కారణమని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విషయం మనకు తెలిసిందే. బాలీవుడ్ నన్ను భరించలేదు అంటూ మహేష్ బాబు చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదానికి దారితీశాయి.

ఈ క్రమంలోనే కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు మహేష్ బాబు పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించగా మరికొందరు ఈయనకు మద్దతు తెలిపారు. ఈ విధంగా మహేష్ బాబు బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేయడంతో బాలీవుడ్ ప్రేక్షకులు మేజర్ సినిమా ద్వారా మహేష్ బాబు పై రివేంజ్ తీర్చుకున్నారని ఈ సినిమా కలెక్షన్లను చూస్తుంటే తెలుస్తోంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus