యంగ్ హీరో అడివి శేష్ టాలీవుడ్ లో తనకంటూ మంచి గుర్తింపుని సంపాదించుకున్నారు. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ లాంటి సినిమాలు అడివి శేష్ కి మంచి పేరు తీసుకొచ్చాయి. హీరోగానే కాకుండా.. రచయితగా తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా ‘మేజర్’కి కూడా రచనా సహకారం అందించారు అడివి శేష్. ఇక ఈ సినిమాలో సందీప్ ఉన్నికృష్ణన్ గా అడివి శేష్ పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దూసుకుపోతుంది.
కమల్ హాసన్ ‘విక్రమ్’ సినిమా నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ.. ఓవరాల్ గా శేష్ సినిమానే పైచేయి సాధిస్తోంది. ఇప్పటికే ‘మేజర్’ సినిమా ఓవరాల్ గా రూ.40 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. అందులో మూడొంతుల మొత్తం తెలుగు రాష్ట్రాల నుంచే వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమాను కొన్న బయ్యర్లంతా సేఫ్ జోన్ లోకి వచ్చేశారు. ప్రస్తుతం లాభాల దిశగా నడుస్తోంది ఈ సినిమా. అయితే ఈ సినిమా రిలీజైన మిగతా భాషలు హిందీ, మలయాళంలో మాత్రం అనుకున్నతంగా రాణించలేకపోతుంది.
అడివి శేష్.. హిందీ, మలయాళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవడం ఈ సినిమాపై ఎఫెక్ట్ చూపిస్తుంది. పైగా హిందీలో ‘భూల్ భులైయా2’ సినిమాకి హిట్ టాక్ రావడంతో జనాలు ఆ సినిమాకే క్యూ కడుతున్నారు. మలయాళంలో పూర్తిగా ‘విక్రమ్’ సినిమా డామినేట్ చేస్తోంది. దీంతో ‘మేజర్’ మీద ఈ భాషల ప్రేక్షకులు ఫోకస్ పెట్టలేదు. ఈ సినిమాకి లాంగ్ రన్ ఉంటుందని నిర్మాతలు చెబుతున్నప్పటికీ.. ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే కష్టమనే అనిపిస్తోంది.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!