Gangs of Godavari: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ పై ట్వీట్.. త్రివిక్రమ్ పై విమర్శలు.!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) ..ది కూడా పవన్ కళ్యాణ్ వంటి మనస్తత్వమే. ‘విజయానికి పొంగిపోవడం అపజయానికి కుంగిపోవడం’.. పవన్(Pawan Kalyan)..లానే త్రివిక్రమ్ కి కూడా రాదు. అతని సినిమాకి ప్లాప్ టాక్ వస్తే.. దానిని తీసుకోవడం కూడా త్రివిక్రమ్ కి బాగా వచ్చు. ‘అజ్ఞాతవాసి’ (Agnyaathavaasi) సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది. అయినా త్రివిక్రమ్.. కుంగిపోయింది లేదు అదే ఏడాది ‘అరవింద సమేత’ తో (Aravinda Sametha Veera Raghava) బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్లోకి వచ్చాడు. ఇక ఈ ఏడాది అతని డైరెక్షన్లో వచ్చిన ‘గుంటూరు కారం’ కి (Guntur Kaaram) కూడా నెగిటివ్ టాక్ వచ్చింది.

చెప్పాలంటే ఆ సినిమాపై కావాలనే కొంతమంది నెగిటివిటీ సృష్టించారు. దానికి త్రివిక్రమ్ రెస్పాండ్ అయ్యింది లేదు. అతను ‘గుంటూరు కారం’ ఫలితాన్ని లైట్ తీసుకున్నాడు. ఇదిలా ఉంటే.. ‘ఫార్చ్యూన్ ఫోర్’ అనే బ్యానర్ ను స్థాపించి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థతో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు త్రివిక్రమ్. ఇటీవల ఈ బ్యానర్ నుండి ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ (Gangs of Godavari) అనే సినిమా వచ్చింది. విశ్వక్ సేన్  (Vishwak Sen) హీరోగా కృష్ణ చైతన్య (Krishna Chaitanya) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి షో నుండే మిక్స్డ్ టాక్ వచ్చింది.

అయినప్పటికీ ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. కానీ ఈ సినిమాకి పెట్టిన బడ్జెట్, జరిగిన బిజినెస్ దృష్ట్యా ఇది సక్సెస్ ఫుల్ మూవీ అనడానికి లేదు. 2 వారాలకే ఓటీటీకి కూడా ఇచ్చేశారు. సినిమా రిలీజ్ దాదాపు 4 వారాలు కావస్తోంది. చాలా వరకు జనాలు ఈ సినిమాని జనాలు మర్చిపోయారు. ఓటీటీలో కూడా పెద్ద మంచి రెస్పాన్స్ రాలేదు. అయితే ఏమైందో ఏమో కానీ ఈరోజు…

‘నెగిటివ్ రివ్యూలు వచ్చినా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ అన్ని ఏరియాల్లోనూ బ్రేక్ ఈవెన్ సాధించి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది’ అంటూ ఓ ట్వీట్ వేశారు. త్రివిక్రమ్ ‘ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్’లో కూడా ఈ ట్వీట్ పడటం గమనార్హం. ఇలాంటి ట్వీట్లు త్రివిక్రమ్ క్రెడిబిలిటీని కూడా తగ్గించే విధంగా ఉంటాయి అని ఇండస్ట్రీలో కొంత మంది విమర్శలు గుప్పిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus