Pushpa2: పుష్ప2 ఎంట్రీతో ఆ సినిమా మేకర్స్ నిర్ణయం మారిందిగా!

కొన్ని నెలల క్రితం వరకు పుష్ప ది రూల్ (Pushpa2) మూవీ చెప్పిన సమయానికి విడుదల కావడం కష్టమని వార్తలు తెగ ప్రచారంలోకి వచ్చాయి. ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలేవీ చెప్పిన తేదీకి విడుదల కావడం లేదు. అందువల్ల పుష్ప ది రూల్ మూవీ రిలీజ్ డేట్ కూడా మారే ఛాన్స్ ఉందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే పుష్ప2 టీజర్ రిలీజ్ తో కూడా సినిమా రిలీజ్ డేట్ లో మార్పు లేదని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.

బన్నీ (Allu Arjun) మూవీ రేసులో ఉండటంతో సింగం అగైన్ మూవీ రిలీజ్ డేట్ ను మార్చుకోనుందని తెలుస్తోంది. మొదట ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావించినా పుష్ప ది రూల్ సినిమాతో పోటీ పడితే కలెక్షన్ల పరంగా తీవ్రస్థాయిలో నష్టపోవాల్సి ఉంటుందని సింగన్ అగైన్ మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. సింగం అగైన్ షూట్ కూడా అంతకంతకూ ఆలస్యమవుతోందని భోగట్టా.

పుష్ప ది రూల్ రిలీజ్ సమయానికి ఇతర సినిమాలు సైతం పోటీ నుంచి తప్పుకునే ఛాన్స్ అయితే ఉంది. పుష్ప ది రూల్ సినిమాకు సోలో రిలీజ్ డేట్ దక్కితే ఈ సినిమాకు కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది. పుష్ప ది రైజ్ సినిమా పెద్దగా ప్రమోషన్స్ లేకుండానే బాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్ల విషయంలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. పుష్ప ది రూల్ కు బాలీవుడ్ లో కూడా భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించనున్నారని తెలుస్తోంది.

బన్నీ ఈ సినిమా విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. పుష్ప ది రూల్ మూవీ రేంజ్ పెరిగే ఏ అవకాశాన్ని బన్నీ వదులుకోవడం లేదని తెలుస్తోంది. అల్లు అర్జున్ కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. బన్నీ గత రెండు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి హిట్ కాగా భవిష్యత్తు సినిమాలు సైతం అదే ఫలితాన్ని అందుకుంటాయేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus