విడాకులతో పనేమీ లేదు.. విడిపోయారట..!

2017 నుండి మలైకా అరోరా (Malaika Arora) – అర్జున్‌ కపూర్‌.. (Arjun Kapoor) లు డేటింగ్లో ఉంటూ వస్తున్నారు.వెకేషన్స్‌ కు, పార్టీలకు, ఫంక్షన్స్‌ కు వెళ్తూ అక్కడ తీసుకున్న ఫోటోలని సోషల్ మీడియాలో వీరు షేర్ చేస్తూ ఉంటారు.అంతేకాదు పలు రొమాంటిక్ ఫోటోలు కూడా వీరు షేర్ చేయడం, వాటిపై చర్చ జరగడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం. గతంలో మలైకా అరోరా సల్మాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ని పెళ్లి చేసుకుంది. కొంతకాలం వీరు బాగానే కలిసున్నారు.

వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే తర్వాత వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. అందువల్ల వీరు విడాకులు తీసుకోవడం జరిగింది. అయితే మలైకా కొడుకు ఆమె వద్దే ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ల తర్వాత అర్జున్ కపూర్.. మలైకాకి బాగా దగ్గరయ్యాడు. ఆమె కొడుకుని తన సొంత కొడుకుగా చూసుకుంటూ వచ్చాడు. వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అన్నట్టు పలుమార్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

తర్వాత అలాంటిదేమీ లేదు.. ‘మేము సహజీవనాన్ని ఎంజాయ్ చేస్తున్నాము’ అంటూ క్లారిటీ ఇచ్చేవారు. సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. వీరిద్దరి గురించి కొన్ని రోజులుగా ఆసక్తికర ప్రచారం జరుగుతుంది. అదేంటంటే.. మలైకా – అర్జున్ కపూర్..లు త్వరలో విడాకులు తీసుకోబోతున్నారట. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో.. ఈ నిర్ణయానికి వచ్చినట్టు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే అధికారికంగా ఇంకా వీళ్ళు దీనిపై క్లారిటీ ఇచ్చింది లేదు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus