ఏ ఇండస్ట్రీ చూసినా పెళ్లిళ్ల హడావిడి నడుస్తోంది. హీరోలు లేదా హీరోయిన్స్ పెళ్లి పీటలెక్కుతున్నారు. సినిమా రంగంలో ఉన్న వారి కుటుంబాల్లో వరుసగా పెళ్లి బజాలు మ్రోగుతున్నాయి. అయితే తాజాగా మాలీవుడ్ స్టార్ కపుల్ జయరామ్, పార్వతిల కూతురు మాళవిక నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన ప్రియుడైన నవనీత్ గిరీష్‌తో మాళవిక ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. కాగా.. ఇటీవలే మాళవిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తమ రిలేషన్ గురించి అఫీషియల్‌గా ప్రకటించారు.
ప్రియుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అతన్ని అభిమానలకు పరిచయం చేసింది. పరిచయం చేసిన కొద్ది రోజులకే ఎంగేజ్ మెంట్ చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చారు ఈ జంట.. ఉంగరాల మార్పిడి తర్వాత మాళవిక భావోద్వేగానికి లోనయినట్లు ఈ వీడియో తెలుస్తోంది. ఈ ఎంగేజ్ మెంట్ కి కేవలం అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారని సమాచారం. మాళవిక తల్లిదండ్రులు జయరాం, పార్వతి ఇద్దరు నటీనటులే.
నటుడు జయరాం (Jayaram) టాలీవుడ్ మూవీలోనూ నటించారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురములో చిత్రంలో జయరాం కీలక పాత్ర పోషించారు. మలయాళంలో స్టార్ అయిన జయరాం ఈ ఏడాది శివరాజ్‌కుమార్ నటించిన ఘోస్ట్ చిత్రంలో నటించారు. అంతే కాకుండా మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్-1లోనూ కనిపించారు.
అయితే నెల రోజుల క్రితమే జయరాం కుమారుడు కాళిదాస్ ఎంగేజ్‌మెంట్ కూడా జరిగింది. కాళిదాస్ మోడల్, తన ప్రియురాలైన తరిణిని పెళ్లాడనున్నారు. మిస్ యూనివర్స్ ఇండియా 2021లో మూడో రన్నరప్‌గా తరిణి నిలిచింది. అయితే కుమారుడు కాళిదాస్ పెళ్లి కంటే ముందే మాళవిక పెళ్లి జరుగుతుందని పార్వతి వెల్లడించింది.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!