ఇండస్ట్రీ లో తీవ్ర విషాదం.. 27 ఏళ్లకే గుండెపోటుతో మృతి చెందిన స్టార్ హీరోయిన్..!

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను మరింత కలవరపరుస్తున్నాయని చెప్పవచ్చు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు అనారోగ్య కారణంగా చనిపోతున్నారు.. ఇప్పుడు అతి చిన్న వయసులోనే గుండెపోటు కారణంగా ఒక నటి మరణించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఇలా చిన్న వయసులోనే గుండెపోటుతో చనిపోతున్నారు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీ కి చెందిన కొంతమంది సెలబ్రిటీలు కూడా ఇలా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

తాజాగా మలయాళ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. మరో యంగ్ హీరోయిన్ గుండెపోటుతో మృతి చెందడం సెన్సేషన్ సృష్టిస్తోంది.. హీరోయిన్ లక్ష్మీకా సజీవన్ గుండెపోటుతో మృతి చెందింది. అజు అజీష్ దర్శకత్వం వహించిన కాక్క అనే షార్ట్ ఫిల్మ్‌ తో సినీ కెరీర్ ను మొదలుపెట్టింది. పంచమి అనే పాత్రలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ షార్ట్ ఫిల్మ్ తరువాత ఆమె పంచవర్ణతతా, సౌదీ వెల్లక్కా, పూజయమ్మ, ఉయారే, ఒరు కుట్టనాదన్ బ్లాగ్, నిత్యహరిత నాయగన్, దుల్కర్ సల్మాన్ నటించిన ఒరు యమందన్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించింది.

ప్రస్తుతం లక్ష్మీకా (Lakshmika Sajeevan) యూఏఈలో నివసిస్తోంది. ఇక గతరాత్రి ఆమె గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. లక్ష్మీకా సజీవన్ వయస్సు 27 ఏళ్లు. ఇంత చిన్న వయస్సులో ఆమె ఇలా మృత్యువాత పడడం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తుందని పలువురు ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా.. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు దేవుడు ధైర్యం ఇవ్వాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus