Nagarjuna: ఆ డైరెక్టర్ నాగ్ కు భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారా?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన నాగార్జున ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. వరుస ఫ్లాపులతో ఢీలా పడిన నాగ్ తర్వాత ప్రాజెక్ట్ తో కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది. అయితే నాగ్ ఒక మలయాళ దర్శకునికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. మలయాళంలో సినిమాటోగ్రాఫర్ గా, దర్శకునిగా శ్యామ్ దత్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మమ్ముట్టి హీరోగా ఒక సినిమాను తెరకెక్కించి ఆ సినిమాతో దర్శకునిగా శ్యామ్ దత్ మంచి పేరు సంపాదించుకున్నారు.

పలు తెలుగు సినిమాలకు కూడా శ్యామ్ దత్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. శ్యామ్ దత్ ప్రసన్న కుమార్ కథతో ఈ సినిమాను తెరకెక్కిస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారం నిజమో కాదో స్పష్టత రావాల్సి ఉంది. ఈ డైరెక్టర్ నాగ్ కు భారీ హిట్ ఇస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. నాగార్జున కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకూడదని భావించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతోమంది డైరెక్టర్లను పరిచయం చేశారు.

ఆ డైరెక్టర్లలో ఎంతోమంది స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. (Nagarjuna) నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కాంబోలో ఒక సినిమాను ప్లాన్ చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. నాగార్జున విషయంలో ఏజ్ అనేది జస్ట్ నంబర్ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నాగార్జున రాబోయే రోజుల్లో మరిన్ని సక్సెస్ లను అందుకోవడంతో పాటు అక్కినేని ఫ్యామిలీ సక్సెస్ రేట్ ను పెంచాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో అక్కినేని హీరోలు నటిస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అక్కినేని హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. అక్కినేని హీరోలకు 2024 సంవత్సరం అయినా కలిసిరావాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus