Malla Reddy: మహేష్ బాబుని తెగ నవ్వించేసిన మినిస్టర్ మల్లారెడ్డి!

‘అర్జున్ రెడ్డి’ ‘కబీర్ సింగ్’..ల తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాని హిందీతో పాటు తెలుగులో కూడా టీం బాగా ప్రమోట్ చేస్తుంది. ఈ క్రమంలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి అలాగే ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు, దిల్ రాజు విచ్చేశారు. మహేష్ బాబు ఎంట్రీతో అందరిలో ఓ తెలియని ఎనర్జీ పాసైనట్టు అనిపించింది.

మరోపక్క మంత్రి మల్లారెడ్డి స్పీచ్ ఇస్తూ.. ‘రాబోయే రోజుల్లో టాలీవుడ్ బాలీవుడ్ ను, హాలీవుడ్ ను కూడా ఏలుతుంది అని చెప్పుకొచ్చారు. అలాగే మీ బాలీవుడ్ సెలబ్రిటీలు.. ఇంకో సంవత్సరంలో హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి. ముంబై పాతదైపోయింది. బెంగళూరులో విపరీతమైన ట్రాఫిక్ జామ్ తో నిండి ఉంటుంది. ఇండియాలో హైదరాబాద్ ని కొట్టే సిటీ లేదు’ అని ఆయన ప్రసంగించారు.

అలాగే (Malla Reddy) మహేష్ బాబు ని చూసిన ఆయన ” మహేష్ బాబు గారు నేను మీ ‘బిజినెస్ మెన్’ సినిమాని 10 సార్లు చూశాను. ఆ సినిమా చూసే రాజకీయాల్లో రాణించగలిగాను. ఆ సినిమా చూసే నేను మినిస్టర్ అయ్యాను” అంటూ మంత్రి మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ కి మహేష్ బాబు తెగ నవ్వుకున్నాడు. అలాగే మహేష్ పక్కనున్న వారంతా నవ్వుకోవడంతో అక్కడి వాతావరణం సందడిగా మారిపోయింది అని చెప్పాలి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus