Mallika Sherawat: ఇండస్ట్రీలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా : మల్లికా శెరావత్

బాలీవుడ్ లో బోల్డ్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి మల్లికా శెరావత్. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ప్రస్తుతం ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల ఆమె కీలకపాత్రలో నటించిన ‘నకాబ్’ సిరీస్ విడుదలైన నేపథ్యంలో మల్లికా శెరావత్ విలేకర్లతో ముచ్చటించారు. ఇందులో భాగంగా తన సినీ కెరీర్ గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను బయటపెట్టింది మల్లికా శెరావత్. నటిగా తన ప్రయాణం చాలా సాఫీగా మొదలైందని.. నటి కావాలనే ఉద్దేశంతోనే ముంబైకి వచ్చానని చెప్పింది.

వెంటనే ‘క్వాయిష్’లో ఆ తరువాత ‘మర్డర్’ సినిమాలో అవకాశం వచ్చిందని చెప్పింది. దానివలన అదృష్టవశాత్తు క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కోలేదని.. కానీ ‘మర్డర్’ సినిమా తరువాత తనపై బోల్డ్ అనే ముద్ర పడిందని.. చాలామంది స్టార్ హీరోలు తనతో మితిమీరి బోల్డ్ గా మాట్లాడేవాళ్లు అని చెప్పింది. ఆన్ స్క్రీన్ లోనే కాదు.. వ్యక్తిగతంగా కూడా నువ్ మాతో బోల్డ్ గా ఉండొచ్చు అనేవాళ్లని.. వ్యక్తి, వృత్తిపరమైన జీవితాన్ని వాళ్లు ఒకేలా చూడడం వలన ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.

దాంతో ‘నన్ను క్షమించండి.. నేను అలాంటి వ్యక్తిని కాను. ఆ విషయంలో నేను రాజీ పడను. నా కంటూ కెరీర్ నిర్మించుకోవాలని ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను’ అంటూ చెప్పేదాన్ని అని తెలిపింది. దాని కారణంగానే కొంతమంది స్టార్ హీరోలు తనతో వర్క్ చేయలేదని మల్లికా వివరించింది.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus