మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఒక విభిన్నమైన కథతో మన ముందుకు రానున్నారు. కేరళ రాష్ట్ర చరిత్రలోని ఒక అద్భుతమైన కథతో ఆయన నటించిన `మామాంగం’ మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందించారు. జమోరిన్ పాలనలో చావెరుక్కళ్ యుద్ధ వీరుల చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ హిస్టారికల్ మూవీలో ఎన్నడూ చూడనటువంటి విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు మమ్ముట్టి. అతి ప్రాచీనమైన కలరి విద్యలోని విశిష్టతను ఇంతకు ముందు ఎవరూ చూపించినంతగా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఎం. పద్మకుమార్ దర్శకత్వంలో కావ్య ఫిల్మ్ కంపెనీ పతాకంపై వేణు కున్నపిళ్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఆయన లేడీ గెటప్ లో కనిపించనున్నారు. ఈ క్యారెక్టర్ సినిమాలో చాలా కీలకం. ఇది ఏ సందర్భంలో వస్తుంది అనేది మాత్రం సర్ ప్రైజ్. ఈ లేడీ గెటప్ లుక్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ విడుదలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. డిసెంబర్ 3న ఈ చిత్రం ట్రైలర్ ను విడుదల చేయనున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ….. “1695వ సంవత్సరంలో జరిగిన ఒక నిజమైన కథతో, ఇంతకు ముందెన్నడూ చూడనటువంటి విజువల్స్‌తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారూ. మామాంగం` చిత్ర ట్రైలర్ ను డిసెంబర్ 3న, చిత్రాన్ని డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాం ” అని తెలిపారు.