Mammotty: పాత సినిమాలే కలర్‌ చేస్తుంటే… మమ్ముట్టి బ్లాక్‌ సినిమా!

బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాలను రంగులమయం చేసి రిలీజ్‌ చేస్తున్న రోజులివి. ఏదైనా పాత సినిమా టీవీలో వస్తుంటే, అందులోనూ అది బ్లాక్‌ అండ్‌ వైట్‌ అయితే చూడటానికి నేటి తరం యువత ముందుకు రారు. అయితే వాళ్లందరికీ బ్లాక్ అండ్‌ వైట్‌ నచ్చదా అంటే… ఇన్‌స్టాగ్రామ్‌లో, వాట్సాప్‌ స్టేటస్‌లలో మోనో క్రోమ్‌ ఫొటోలు, బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలు షేర్‌ చేస్తుంటారు. అయితే అలాంటివాళ్ల కోసం మమ్ముక్క అలియాస్‌ మమ్ముట్టి ఓ బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమాను తీసుకొస్తున్నారు.

గత కొన్ని రోజులుగా సోషల్‌ మీడియో మమ్ముట్టి ఫొటోలు కొన్ని వైరల్‌ అవుతున్నాయి. ‘భ్రమయుగం’ అనే ఓ సినిమా చేస్తున్నారని, దాని కోసమో ఆ విచిత్ర గెటప్‌ వేశారని అంటున్నారు. ఇంత వెరైటీగా ఆలోచించడం మమ్ముక్కకే చెల్లింది, ఈ 70 ఏళ్ల వయసులో ప్రయోగమంటే అద్భుతం అంటూ మెచ్చేసుకుంటున్నారు. అయితే ఆ మెచ్చుకోలును మరింత పెంచేలా ఇప్పుడు మరో పని చేశారాయన. అదే బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా.

అమ్మమ్మల తాతయ్యల కాలంలో బ్లాక్ అండ్ వైట్ సినిమాలు ఎగబడి చూసేవారట. ఈ టెక్నాలజీ కాలంలో అలాంటి సినిమాను చూపించడానికి మమ్ముట్టి సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘భ్రమయుగం’ సినిమాను పూర్తిగా బ్లాక్‌ అండ్‌ వైట్‌లో రిలీజ్‌ చేస్తారట. ఈ మేరకు ఫిబ్రవరి 15న మలయాళం, తెలుగుతో పాటు అన్ని ప్రధాన దక్షిణాది భాషల్లో సినిమాను విడుదల చేస్తారట.

నిజానికి తెలుగు దర్శకుడు రాజ్ మాదిరాజు ఇదే తరహాలో ‘గ్రే’ అనే సినిమా బ్లాక్ అండ్ వైట్‌లో తీశారు. అయితే సరైన కాస్టింగ్ లేకపోవడం, ప్రచారం లేకపోవడంతో పెద్దగా హైలైట్‌ అవ్వలేదు. కానీ ఇప్పుడు మమ్ముట్టి లాంటి యాక్టర్‌ ఉండటంతో ఈ సినిమా మీద హైప్‌ పెరుగుతోంది. ఇక ఈ సినిమా పూర్తిగా హారర్. ఆయన గెటప్ కూడా భయంకరంగానే ఉంది. హీరోయిన్, పాటలు, కమర్షియల్ మసాలా ఏవీ ఉండవు. అయితే ఈ సినిమా మీద (Mammotty) మమ్ముక్క మంచి నమ్మకంతో ఉన్నారట.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus