హీరోయిన్ ని వేధిస్తోన్న వ్యక్తి అరెస్ట్!

  • July 9, 2021 / 08:09 PM IST

సినీ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ సనమ్ శెట్టిని చంపుతానంటూ ఓ ఆకతాయి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమెకి పదే పదే మెసేజ్ లు పంపుతూ వేధించసాగాడు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చింది. కొద్ది నెలలుగా తనకు దారుణమైన మెసేజ్ లు వస్తున్నాయని.. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లలో వచ్చే మెసేజ్ లను పెద్దగా పట్టించుకోలేదని చెప్పారు. కానీ తనతో పాటు తన కుటుంబాన్ని కూడా చంపుతానంటూ తన ఫోన్ నెంబర్ కు బెదిరింపు మెసేజ్ లు వచ్చినట్లు చెప్పింది.

సదరు వ్యక్తి తన వ్యక్తిగత విషయాలు కూడా సేకరించినట్లు అనిపించడంతో వెంటనే అప్రమత్తమైన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. ఎవరికైనా ఇలాంటి బెదిరింపులు ఎదురైతే.. వెంటనే బయటకు చెప్పాలి.. సాయం తీసుకోవాలని.. ఒకరకంగా అది వేరేవాళ్లకు కూడా సాయం చేసినట్లు అవుతుందని చెప్పుకొచ్చింది. ఆమె ఫిర్యాదు స్వీకరించిన చెన్నై పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని రాయ్ జాన్ పాల్ గా గుర్తించారు.

అయితే అతడు ఏ ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడ్డాడనే విషయాన్ని తెలుసుకునే పనిలో పడ్డారు. తనను వేధిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్న చెన్నై పోలీసులకు సనమ్ శెట్టి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పింది. అలానే కొద్దిరోజులుగా తనకు ధైర్యం చెబుతూ అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపింది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus