అక్కినేని హీరోలంతా ఒకే సినిమాలో!

అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ లాంటి క్లాసికల్ హిట్ ను ఇచ్చారు దర్శకుడు విక్రమ్ కె కుమార్. అప్పటినుండి అక్కినేని ఫ్యామిలీకి విక్రమ్ అంటే ప్రత్యేక అభిమానం. ఏఎన్నార్ అభిమానులకు కూడా ఈ సినిమా స్పెషల్ గా గుర్తుండిపోతుంది. ఈ సినిమా తరువాత అఖిల్ ని హీరోగా పెట్టి ‘హలో’ సినిమా తీశారు విక్రమ్. ఈ సినిమా పెద్దగా ఆడనప్పటికే నాగచైతన్యతో మరో సినిమా ‘థాంక్యూ’ మొదలుపెట్టగలిగాడు. ఇప్పుడు మరోసారి అక్కినేని హీరోలంతా కలిసి ఓ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

‘మనం’ లాంటి ఓ మంచి ఫ్యామిలీ కథ విక్రమ్ మదిలో మెదిలిందని.. అందులో నాగార్జున-నాగచైతన్య-అఖిల్ లతో పాటు అక్కినేని కుటుంబంలో మిగిలిన నటీనటులు సుమంత్, సుశాంత్, అమల, సమంతలు కూడా నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ‘మనం’ సినిమాలో సుశాంత్, అమల, సుమంత్ లకు ఛాన్స్ దొరకలేదు. కానీ ఈసారి వాళ్లకి కూడా కథలో కీలకమైన పాత్రలు లభిస్తాయని తెలుస్తోంది. మనం కథకీ, ఈ సినిమా కథలు ఎలాంటి పోలికలు, సంబంధం లేదు.

కేవలం అక్కినేని హీరోలందరికీ సరిపడా కథ అని మాత్రం తెలుస్తోంది. ఇలా ఓ కుటుంబంలోని హీరోలంతా కలిసి నటించే సినిమా ఇప్పటివరకు ఇండస్ట్రీలో రాలేదనే చెప్పాలి. కాబట్టి ఈ సినిమా ప్రత్యేకంగా ఉండబోతుందని మాత్రం తెలుస్తోంది. ‘మనం’ లాంటి క్లాసిక్ సినిమా తీసిన విక్రమ్ మరి ఈసారి ఎలాంటి సినిమా తీయబోతున్నాడో!

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus