ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ తో వందల కొద్ది అవార్డులు, ఎన్నో అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ ఫెస్టివల్స్ లో స్క్రీనింగ్ చేసే అవకాశం దక్కించుకున్న దీపక్ రెడ్డి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అత్యంత అవార్డులు అందుకున్న చిత్రంగా నిలిచిన విషయం తెల్సిందే.
భారత దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిస్తూ ఆస్కార్ క్వాలిఫైయింగ్ స్క్రీనింగ్ అవకాశం కూడా దక్కించుకున్నారు. అయితే స్క్రీనింగ్ కోసం అమెరికా కి దర్శకుడు వెళ్లలేక పోవడం చాలా దురదృష్టకరం. అయితే కోవిడ్ కారణంగా 2 ఏళ్లగా వీసా నిబంధనలు ఉండటం వల్ల, ఒక్క ఫిలిం ఫెస్టివల్ స్క్రీనింగ్ కూడా అటెండ్ అవ్వలేకపోయాడు. చివరగా ఈ సెప్టెంబర్ నెలలో ఉన్న న్యూ జెర్సీ , హాలీవుడ్ లో ఉన్న రెండు ఈవెంట్స్ కి అయినా అటెండ్ అయి దేశాన్ని రెప్రెసెంట్ చేయాలన్నది అతని కోరిక.
ఇందుకు సంబంధించిన అధికారులకి విజ్ఞప్తి చేస్తూనే వీలైన అవకాశాలని సూచించమని దర్శకుడు దీపక్ రెడ్డి చేసిన ట్వీట్ కి కొందరు సలహాలు ఇస్తూ ఉంటే మరి కొందరు నేరుగా సాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న ఈ దర్శకుడికి సాధ్యమైనంత త్వరగా వీసా సమస్యలు తీరిపోవాలని కోరుకుందాం.