Suhani Kalita: హాట్ టాపిక్ అయిన ‘మనసంతా నువ్వే’ చైల్డ్ ఆర్టిస్ట్ లేటెస్ట్ ఫోటోలు!
- June 3, 2025 / 08:00 PM ISTByPhani Kumar
‘మనసంతా నువ్వే’ (Manasantha Nuvve) అంత ఈజీగా మర్చిపోయే సినిమా కాదు. దివంగత స్టార్ హీరో ఉదయ్ కిరణ్ (Uday Kiran) నటించిన ఈ సినిమాని విఎన్ ఆదిత్య (V. N. Aditya) దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2001లో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యింది. ‘చిత్రం’ తర్వాత ఉదయ్ కిరణ్, రీమా సేన్ (Reema Sen) ఈ సినిమాలో జంటగా నటించారు. దీనికి కూడా ఆర్పీ పట్నాయక్ (R. P. Patnaik) సంగీతం అందించడం జరిగింది. ఇందులో సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ‘తూనీగ తూనీగ’ అనే సాంగ్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Suhani Kalita

ఈ పాటలో చిన్నప్పటి రీమా సేన్ గా కనిపించిన పాపను కూడా అంత ఈజీగా మర్చిపోలేరు. తర్వాత ఆమె హీరోయిన్ గా కూడా చేసింది అనేది బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ పాప పేరు సుహాని కలిత (Suhani Kalita). చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘మనసంతా నువ్వే’ తో పాటు.. ఎన్టీఆర్ ‘బాల రామాయణం’, వెంకటేష్ (Venkatesh Daggubati) ‘గణేష్’(Ganesh) , ‘ప్రేమంటే ఇదేరా’, (Premante Idera) నాగార్జున (Nagarjuna) ‘ఎదురులేని మనిషి’ (Eduruleni Manishi), తరుణ్ (Tarun Kumar) ‘ఎలా చెప్పను'(Ela Cheppanu) , వంటి చిత్రాల్లో నటించింది. తర్వాత హీరోయిన్ గా మారి ‘సవాల్’ ‘కృషి’ ‘స్నేహ గీతం’ (Sneha Geetham) వంటి చిత్రాల్లో నటించింది.

అలాగే పలు తమిళ చిత్రాల్లో కూడా నటించింది. కానీ హీరోయిన్ గా ఈమె నిలబడలేకపోయింది. ఆ తర్వాత ఛాన్సులు లేకపోవడంతో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ప్రముఖ సంగీత కళాకారుడు, మోటివేషనల్ స్పీకర్ అయినటువంటి విభర్ హసీజాను ఈమె వివాహం చేసుకుంది. ప్రస్తుతం ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ గా వ్యవహరిస్తోంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె (Suhani Kalita) చాలా అందంగా కనిపిస్తుంది.












