Manchu Lakshmi: భర్త గురించి మంచు లక్ష్మీ కామెంట్స్.. అలాంటి వాళ్ళని నేను పట్టించుకోను అంటూ..!

మంచు లక్ష్మీ (Manchu Lakshmi) …. మోహన్ బాబు (Mohan Babu)  కూతురి గానే కాదు, నటిగా, నిర్మాతగా, మంచి హోస్ట్ గా కూడా ఫేమస్. కానీ సోషల్ మీడియాలో ఈమె మాట తీరుపై ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. మరోపక్క ఈమెకు పెళ్ళైనా సరే.. ఇంకా మంచు అనే ఇంటిపేరుని వాడుకోవడం.. అలాగే భర్తకు దూరంగా ఉండటం గురించి జనాలు రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. అయితే ఈ విషయంపై మొదటిసారి మంచు లక్ష్మీ ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.

Manchu Lakshmi

మంచు లక్ష్మీ మాట్లాడుతూ.. ” నా భర్త పేరు చాలా మందికి తెలుసు. అయినప్పటికీ ఇంకోసారి చెబుతున్నాను. నా భర్త పేరు ఆండీ శ్రీనివాసన్. ఆయన ఫారెన్లో ఐటి ప్రొఫెషనల్ గా పని చేస్తున్నారు. మేము మా మ్యారీడ్ లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా ప్రశాంతంగా ఉన్నాము. మాలో ఒకరికి ఇంకొకరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఏదైనా చేస్తాము. ఒకరికి ఇంకొకరు స్వేచ్చని ఇచ్చుకుంటాం. న్యూక్లియర్ ఫ్యామిలీ గురించి వినే ఉంటారు.

మేము కూడా అదే పద్ధతిలో జీవిస్తాము. ప్రైవసీ, కుటుంబం పట్ల బాధ్యత మేము ఎక్కువగా తీసుకుంటాము. మాకు నచ్చినట్టు మేము జీవిస్తున్నాం. మేము ప్రశాంతంగా ఉండటం గురించి జనాలు ఏమనుకుంటారు? ఏమనుకుంటున్నారు? అనేది మేము పట్టించుకోము. ప్రస్తుతం నేను నా భర్త కలిసే ఉంటున్నాం. నా కూతురు కూడా నా భర్త దగ్గరే ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చింది.

ఇక మంచు మనోజ్ (Manchu Manoj)  – భూమా మౌనిక..ల పెళ్లికి కూడా మంచు లక్ష్మీ భర్త ఆండీ శ్రీనివాసన్ హాజరయ్యారు. మంచు లక్ష్మీతో కలిసి నూతన దంపతులను వారు ఆశీర్వదించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus