Manchu Lakshmi: టాలీవుడ్ స్టార్స్ గురించి మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

  • May 25, 2024 / 09:00 PM IST

తెలుగు రాష్ట్రాల సినీ అభిమానులకు మంచు లక్ష్మి (Manchu Lakshmi)  గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ఆమె యాసను ట్రోల్ చేసినా ఎన్నో సినిమాలలో తన అద్భుతమైన నటనతో మంచు లక్ష్మి ప్రశంసలు పొందారు. జయాపజయాలతో సంబంధం లేకుండా మంచు లక్ష్మి నటిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ నటిగా మంచు లక్ష్మి సత్తా చాటుతున్నారు. మంచు లక్ష్మి నటించిన యక్షిణి వెబ్ సిరీస్ త్వరలో విడుదల కానుంది.

జూన్ నెల 14వ తేదీ నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. నేను ముంబైకు షిఫ్ట్ కావడంతో బాలీవుడ్ కు వెళ్లానని కొందరు భావిస్తున్నారని మంచు లక్ష్మి అన్నారు. నేను హాలీవుడ్ నుంచి వచ్చానని నాకు ఏ భాష అయినా ఒకటేనని మంచు లక్ష్మి వెల్లడించడం గమనార్హం. నేను తమిళంలో కూడా చేశానని ఆమె తెలిపారు.

కెరీర్ కోసం, కూతురు భవిష్యత్తు కోసం ముంబై వెళ్లానని మంచు లక్ష్మి అన్నారు. నేను కన్నప్పలో నటించడం లేదని మంచు లక్ష్మి క్లారిటీ ఇచ్చారు. ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని రానా (Rana) , చరణ్ (Ram Charan), తారక్ (Jr NTR) మేమంతా కలిసే పెరిగామని ఆమె వెల్లడించారు. మేమంతా కలిసే ఉన్నామని ఆమె పేర్కొన్నారు. నేను నచ్చిన వాళ్లు నన్ను అభిమానిస్తారని మంచు లక్ష్మి పేర్కొన్నారు.

రేవ్ పార్టీ గురించి ప్రశ్న ఎదురు కాగా అక్కడ ఏం జరిగిందో నాకు తెలియదని మంచు లక్ష్మి పేర్కొన్నారు. ఈ ప్రశ్న అడగటానికి ఇది సందర్భం కాదని వెబ్ సిరీస్ గురించి ప్రశ్నలు అడగాలని మంచు లక్ష్మి అన్నారు. ఎవరో ఎక్కడికో వెళ్తే నాకేంటి సంబంధం అని ఆమె కామెంట్లు చేశారు. యక్షిణి వెబ్ సిరీస్ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ఈ వెబ్ సిరీస్ హిట్ కావాలని ఆమె ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus