Manchu Lakshmi: మంచు లక్ష్మీకి చేదు అనుభవం.. అనుకోకుండా ఆ పొరపాటు చేసేసింది!

మంచు మోహన్ బాబు కుమార్తె, ప్రముఖ నటి, హోస్ట్.. అయిన మంచు లక్ష్మికి ఓ చేదు అనుభవం ఎదురైంది. అది కూడా ఇండిగో ఫ్లైట్ సంస్థ వల్ల. గతంలో అనసూయ, హరీష్ శంకర్ , రానా వంటి వారు విమాన సంస్థల వల్ల ఇబ్బంది పడినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లైట్ ఆలస్యమై కొందరు, ఫ్లైట్ ఎక్కేసమయంలో మాస్క్ వంటి విషయాలతో ఇబ్బంది పెట్టారు సీట్స్ కూడా బాగోలేదు, నేను ఒకచోట బుక్ చేసుకుంటే, మరోచోట సీట్స్ ఇచ్చారు అంటూ మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన సందర్భాలు ఉన్నాయి.

రానా అయితే తన లగేజ్ విషయంలో ఇండిగో సంస్థ చాలా ఇబ్బంది పెట్టింది అంటూ ఇండిగో సంస్థను ట్యాగ్ చేసి మరీ తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పుడు మంచు లక్ష్మీ కి కూడా ఇంచు మించు ఇదే పరిస్థితి ఏర్పడింది. విషయం ఏంటి అంటే…మంచు లక్ష్మీ సోమవారం నాడు తిరుపతి నుండి హైదరాబాద్ బయల్దేరారు. శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన తర్వాత ఆమె అనుకోకుండా తన బ్యాగ్ ను మరచిపోయింది. ఈ క్రమంలో విమాన సిబ్బందికి తెలిపినా… 40 నిమిషాల పాటు ఆమెను గేటు బయట వెయిట్ చేయించారట.

దీంతో ఆమె అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ వేయలనుకుంది. కానీ మొదట ఇండిగో వారిని కాకుండా వేరే సంస్థను ట్యాగ్ చేసింది. తర్వాత ఆ పొరపాటుని సరిచేసుకుని ఇండిగో సంస్థను ట్యాగ్ చేసింది. ఆ సమయంలో తాను 103 డిగ్రీల జ్వరంతో ఉన్నానని, తన బ్యాగ్ మరిచిపోయినట్టు సిబ్బందికి తెలిపినా స్పందించలేదంటూ ఆమె ట్వీట్ లో పేర్కొంది. ‘ నేను తిరుపతి నుండ హైదరాబాద్ రావడానికి కూడా అంత సమయం పట్టలేదని…

గంటకు పైగా ఎదురు చూసినా తన బ్యాగ్ తెచ్చివ్వలేదని, గ్రౌండ్ స్టాఫ్ ఒక్కరు కూడా రాలేదని, అసలు ఒక్క కస్టమర్ సర్వీస్ కూడా లేకుండా ఇండిగో సంస్థ ను ఎలా రన్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘బ్యాన్ ఇండిగో’ అని హ్యాష్ ట్యాగ్ ను కూడా ఈ సందర్భంగా ఆమె జత చేయడం జరిగింది. దీంతో ఇండిగో సంస్థ స్పందించి…మంచు లక్ష్మీ కి జరిగిన అసౌకర్యానికి క్షమాపణ చెప్పింది. ‘మా మేనేజర్ మీకు సహకరిస్తారు.. మీరు లగేజ్ కలెక్ట్ చేసుకుని ఉంటారని భావిస్తున్నాం. తిరిగి మీరు మా ఫ్లైట్‌లో ప్రయాణిస్తారని ఆశిస్తున్నాం’ అని కూడా ఇండిగో సంస్థ పేర్కొంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus