Manchu Lakshmi: గాయాల పాలైన లక్ష్మి మంచు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

కెరీర్ ప్రారంభంలో బుల్లితెర పై పలు టాక్ షోలు చేసిన మోహన్ బాబు కుమార్తె లక్ష్మి మంచు తర్వాత నటిగా కూడా మారిన సంగతి తెలిసిందే. సిద్ధార్థ్, శృతి హాసన్ జంటగా నటించిన ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంలో ఆమె విలన్ గా నటించింది.అటు తర్వాత కూడా పలు సినిమాల్లో నటించింది. విమెన్ సెంట్రిక్ మూవీస్ లో కూడా ఈమె నటించిన సంగతి తెలిసిందే. ట్యాలెంట్ ఉన్నప్పటికీ.. మంచి నటన కనపరుస్తున్నప్పటికీ ఎందుకో ఈమె స్టార్ నటిగా ఎదగలేకపోయింది.

‘బాహుబలి’ లో రమ్యకృష్ణ పోషించిన శివగామి పాత్ర.. ముందు ఈమెనే వెతుక్కుంటూ వచ్చింది. ‘కానీ ప్రభాస్ కు తల్లిగా చేయడం ఏంటి?’ అని పక్కన పెట్టింది. ఇదిలా ఉండగా.. సోషల్ మీడియాలో ఈమె క్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఆమె తనకు సంబంధించిన ఓ ఫొటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ ఫోటోలో ఆమె చేతికి గాయాలు అయినట్లు కనిపిస్తోంది .దీంతో ఆమె ఫాలోవర్స్ ఏమైందంటూ కంగారు పడ్డారు.మరికొంతమంది అయితే త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ క్రమంలో ఆమె అసలు విషయాన్ని తెలియజేసింది. ‘‘హాయ్‌ గాయ్స్‌.. మీ ప్రేమాభిమానాలకు చాలా థాంక్స్.నా ఇన్స్టా స్టోరీ పై స్పందిస్తూ సానుభూతి వ్యక్తం చేస్తున్నందుకు చాలా థాంక్స్. ఆ ఫొటో గురించి స్పష్టంగా చెప్పనందుకు సారీ. నేను నటిస్తున్న ‘అగ్నినక్షత్రం’ చిత్రం షూటింగ్ స్పాట్ లో పిక్ అది. అంత సహజంగా నా లుక్ మార్చిన మేకప్ ఆర్టిస్టులకు కృతజ్ఞతలు” అంటూ మంచు లక్ష్మి పేర్కొంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus