Manchu Lakshmi: బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన మంచు లక్ష్మి!

నిన్నటినుండి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన సినీ తారలు మరియు టీవీ సెలబ్రిటీలు తెగ వణికిపోతూ వాళ్లు అప్పట్లో పోస్ట్ చేసిన వీడియోలన్నీ తమ ప్రొఫైల్ నుండి డిలీట్ చేయడమో లేక హైడ్ చేయడమో చేస్తూ వస్తున్నారు. అయితే.. సదరు ప్రమోషనల్ వీడియోస్ ఇంటర్నెట్ లో ఇంకా ఉండడం అనేది వారికి శాపంగా మారింది. ఎందుకంటే.. సదరు బెట్టింగ్ యాప్స్ ఈ వీడియోస్ ను రకరకాల ప్లాట్ ఫార్మ్స్ లో ప్రమోట్ చేసింది.

Manchu Lakshmi

అందులో నుండి డిలీట్ చేయడం అనేది వీళ్ళ చేతిలో ఉండకపోవడంతో.. ఏం చేయాలో తెలియక తికమకపడుతున్నారు. ఈ జాబితాలో ఇప్పుడు మంచు లక్ష్మి కూడా చేరింది. కొన్నాళ్ల క్రితం ఇన్స్టాగ్రామ్ లో ఆమె ప్రమోట్ చేసిన ఓ బెట్టింగ్ యాప్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దాంతో నెటిజన్లు ఈమెను కూడా అరెస్ట్ చేయాలి అని కదా అని సోషల్ మీడియా సాక్షిగా నిలదీస్తున్నారు.

అయితే.. మంచు లక్ష్మి (Manchu Lakshmi)  మాత్రమే కాదు చాలామంది బడా హీరోయిన్లు సైతం ఈ యాప్స్ ను ప్రమోట్ చేసి ఉన్నారు. కాకపోతే.. వాళ్లు ఎక్కువకాలం సదరు వీడియోలను తమ ప్రొఫైల్ పైన ఉంచలేదు. అందువల్ల కాస్త సేఫ్ అయ్యారు. ప్రస్తుతం నెటిజన్లు మిగతా హీరోయిన్లు చేసిన బెట్టింగ్ యాప్ వీడియోలను తవ్వి తీసే పనిలో ఉన్నారు. అవన్నీ గనుక దొరికి..

తెలంగాణా పోలీసులు నిజంగానే యాక్షన్ తీసుకోవడం మొదలుపెడితే.. సగానికిపైగా మంచి హీరోయిన్లు ఊచలు లెక్కపెట్టాల్సిందే. మరి ఈ తంతుకి ఎక్కడా బ్రేక్ పడుతుంది అనేది చూడాలి. ఇకపోతే.. సెలబ్రిటీలు అందరూ ఇప్పుడు సారీ వీడియోలు పెడుతూ.. బెట్టింగ్ యాప్స్ ను బ్యాన్ చేయాలి అని పోలీసులకు సపోర్ట్ చేస్తూ వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus