మంచు లక్ష్మి ఈ పేరు తెలియని వారెవరు ఉండరు మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె పలు సినిమాలు టీవీ కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఇకపోతే మంచు లక్ష్మి తన భాష ద్వారా అందరిని పెద్ద ఎత్తున సందడి చేయడమే కాకుండా తన మాట్లాడే మాటల వల్ల ఎన్నోసార్లు ట్రోలింగ్ కి గురవుతూ ఉంది. అయితే ఈమె సోషల్ మీడియా వేదికగా ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా ఆ పోస్ట్ పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి గురవుతుంది.
మంచు లక్ష్మి ఇప్పటికే తను చేసే పోస్టుల వల్ల ఎన్నోసార్లు ట్రోలింగ్ కి గురైన తను మనసు మాత్రం ఎంతో మంచిదని ఇప్పటికే పలు సేవా కార్యక్రమాల ద్వారా తన మంచితనాన్ని నిరూపించుకున్నారు. ఇకపోతే ఇప్పటికే మంచు లక్ష్మి టెక్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమంతో టీచర్స్ లేని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠాలు చెప్పే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కొనసాగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈమె మరో మంచి కార్యానికి శ్రీకారం చుట్టింది.
తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న మన ఊరి మనబడి కార్యక్రమంలో భాగంగా ఈమె ఏకంగా 50 గవర్నమెంట్ స్కూల్ లను దత్తత తీసుకొని ఆ స్కూల్లో మౌలిక సదుపాయాలతో పాటు పిల్లలకు కావలసిన అన్ని వసతులను ఏర్పాటు చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈమె 50 పాఠశాలలను దత్తత తీసుకుంది. ఈ క్రమంలోనే యాదాద్రి జిల్లా కలెక్టర్ సమావేశంలో భాగంగా ఈమె ఈ దత్తత తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రవేట్ స్కూల్ లకు దీటుగా, ప్రైవేట్ స్కూళ్లను మరిపించేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దడమే కాకుండా పాఠశాలలో కావాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేయడంతో పాటు, మూడు సంవత్సరాల పాటు స్మార్ట్ క్లాసెస్ ప్రారంభిస్తామని అలాగే విద్యార్థులకు కావలసిన పుస్తకాలు పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా మంచు లక్ష్మి పేర్కొన్నారు. ఇలా మంచు లక్ష్మి ఒకేసారి 50 పాఠశాలలను దత్తత తీసుకుంటున్నారని తెలియడంతో ఎంతో మంది నెటిజన్లు ఈమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!