Manchu Manoj: వాళ్లిద్దరు చాలా బాధపడ్డారు.. ఇక కష్టం లేకుండా చూసుకుంటా: మనోజ్‌

మంచు మనోజ్‌ – మౌనిక రెడ్డి పెళ్లి ఇటీవల ఘనంగా జరిగింది. మంచు లక్ష్మి మొత్తం బాధ్యతలు తీసుకొని ఈ పెళ్లి చేశారనే విషయం తెలిసిందే. దీని వెనుక ఆయన తల్లి నిర్మల కూడా ఉన్నారు. ఈ విషయాన్ని మనోజ్‌ ఇటీవల కొన్ని సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే పెళ్లి అనుకున్నంత ఈజీగా అవ్వలేదని, అసలు వారి బంధం వివాహం వరకు రావడం వెనుక చాలా కష్టాలు దాటారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో తల్లి, అక్క చాలా బాధపడ్డారని చెప్పుకొచ్చాడు మనోజ్‌.

‘‘మా ప్రేమ, పెళ్లి ప్రయాణంలో మా అమ్మ ఎంతో ఇబ్బందిపడింది. నా వల్ల అమ్మ, అక్క బాధపడుతున్నారని అనిపిస్తుండేది. మా బంధం విషయంలో వాళ్లిద్దరే అండగా నిలిచారు. పెళ్లి బాధ్యత మొత్తం అక్కే దగ్గరుండి చూసుకుంది’’ అని ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్‌ అయ్యాడు మనోజ్‌. అంతేకాదు జీవితాంతం అమ్మ, అక్క కష్టపెట్టకుండా సుఖంగా ఉండేలా చూసుకుంటాను అని చెప్పాడు మనోజ్‌. దాంతోపాటు మనోజ్‌ మరో ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు.

బరువు తగ్గడానికి మనోజ్‌ (Manchu Manoj) ఇటీవల డైట్‌ మొదలు పెట్టాడట. అయితే బనానా చిప్స్‌ అంటే చాలా ఇష్టమట. అవి తింటూ డైట్‌ అంటే కష్టం కాబట్టి.. దాచుకుని దొంగతనంగా తినేవాడట. కప్‌ బోర్డ్‌లో బనానా చిప్స్‌ దాచుకుని తినేవాడట. అలా ఒక రోజు చిప్స్‌ తింటూ దొరికిపోయానను అనుకున్నాడట. అయితే ఎలాగోలా మేనేజ్‌ చేసి బయటపడ్డాడట. అయితే ఆ తర్వాత మరోసారి తింటుండగానే చిప్స్‌తో సహా మౌనిక పట్టుకున్నారట.

ఇక ఇదే ఇంటర్వ్యూకు వచ్చిన మౌనిక మాట్లాడుతూ… మామయ్య మోహన్‌బాబు మాతో సరదాగా ఉంటారు అని చెప్పారు. పెళ్లి కాకముందు ఇంటికి వెళ్లినప్పుడు అన్నం తినిపించారు కూడా అంటూ ఆనందం వ్యక్తం చేశారు. నన్నూ, నా కొడుకు ధైరవ్‌ని సొంతవాళ్లలా దగ్గరకు తీసుకున్నారు అని చెప్పారు. అత్తయ్య అయితే ఎప్పుడూ ఫోన్‌ చేసి మాట్లాడుతూనే ఉంటారు. మా పెళ్లికి ముందు అమ్మ చనిపోయినప్పుడు కూడా ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. నన్ను కోడలిగా కన్నా ఒక కూతురుగా కుటుంబంలోకి ఆహ్వానించారు అని అన్నారామె.

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus