Manchu Manoj: మనోజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కారణం ఆయనేనా?

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మనోజ్ వాట్ ద ఫిష్ సినిమాతో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ సినిమా 2024లో రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది. అయితే తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మంచు మనోజ్ పాల్గొంటున్నారని సమాచారం అందుతోంది. తాండూరు బీ.ఆర్.ఎస్. అభ్యర్థి రోహిత్ రెడ్డి విజయాన్ని ఆకాంక్షిస్తూ మంచు మనోజ్ ఈరోజు ప్రచారంలో పాల్గొంటున్నారని తెలుస్తోంది.

రోహిత్ రెడ్డితో మంచి అనుబంధం ఉండటం వల్లే మంచు మనోజ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మంచు మనోజ్ భార్య భూమా మౌనిక కుటుంబానికి కూడా పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న సంగతి తెలిసిందే. భూమా మౌనిక రాబోయే రోజుల్లో ఎన్నికలపై దృష్టి పెట్టనున్నారని ప్రచారం జరుగుతోంది. భూమా మౌనిక స్వయంగా స్పందించి క్లారిటీ ఇస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలిసే ఛాన్స్ అయితే ఉంటుంది.

మరోవైపు మంచు మనోజ్ ఒక టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుండగా ఆ టాక్ షో ఈటీవీ విన్ యాప్ లో త్వరలో ప్రసారం కానుంది. మంచు మనోజ్ హోస్ట్ గా కూడా సక్సెస్ కావాలని అభిమానులు ఫీలవుతున్నారు. మనోజ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. మంచు మనోజ్ సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మరిన్ని సంచలనాలను సృష్టించే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మంచు మనోజ్ పారితోషికం పరిమితంగానే ఉందని తెలుస్తోంది.

మంచు మనోజ్ క్రేజీ ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మంచు మనోజ్ అహం బ్రహ్మస్మి వేర్వేరు కారణాల వల్ల ఆగిపోగా మళ్లీ సెట్స్ పైకి వెళుతుందో లేదో తెలియాల్సి ఉంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags