Manchu Manoj: గుండెల్లో పెట్టి చూసుకున్నారంటూ ఎమోషనల్ పోస్ట్ చేసిన మనోజ్?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో వారసుల పరంపర కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే ఈ క్రమంలోనే మంచు మోహన్ బాబు వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో మంచు మనోజ్ ఒకరు. ఈయన బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం దొంగ దొంగది సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇలా పలు సినిమాలలో నటించిన మంచు మనోజ్ నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో ఈయన సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు.

అహం బ్రహ్మాస్మి అనే సినిమా ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ విడుదల చేయలేదు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ సినిమాలకు పూర్తిగా దూరమవుతున్నారని ఆయన వివిధ వ్యాపారాలు చేసుకుంటూ బిజీ కానున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాను సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పడం లేదంటూ మనోజ్ స్పందించారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి కాస్త విరామం తీసుకున్నారని త్వరలోనే మీ ముందుకు వస్తానని తెలిపారు.

ఇకపోతే ఈయన తన కెరియర్ ని మొదలుపెట్టి ఈనెల ఆరవ తేదీకి 18 సంవత్సరాలు పూర్తి కావడంతో సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.నటుడిగా 18 సంవత్సరాలు నా సినీ కెరియర్ ను పూర్తి చేసుకున్నాను. నేను నటుడిగా మాత్రమే కాకుండా ఒక వ్యక్తిలా కూడా నాకు ఈ కెరియర్ ఎంతో ప్రత్యేకమైనదని తెలిపారు. ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు గల కారణం దర్శక నిర్మాతలు సాంకేతిక నిపుణులు ప్రేక్షకుల ప్రేమాభిమానాలు కారణమని మనోజ్ వెల్లడించారు.

ప్రస్తుతం తాను సినిమా ఇండస్ట్రీకి కాస్త విరామం ప్రకటించినప్పటికీ తననీ ప్రేక్షకులు గుండెల్లో పెట్టి చూసుకున్నారంటూ ఈయన ఎమోషనల్ అయ్యారు. ఇకపోతే తనకు ఎంతో మద్దతుగా నిలబడి తనను ప్రోత్సహిస్తున్న తన కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతోనే తాను ఎంతో ధైర్యంగా ముందుకు వెళుతున్నానని త్వరలోనే మీ అందరి ముందుకు వస్తానంటూ ఈ సందర్భంగా మనోజ్ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus