స్టార్లు ఏం మాట్లాడినా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాకు ఫ్యాన్స్ ఉన్నారు కదా అని.. ఏది పడితే అది మాట్లాడి అతిశయిస్తే.. అనవసరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె అలాంటి విమర్శలే ఎదుర్కొంటుంది అని చెప్పాలి. విషయంలోకి వెళితే.. బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ ( Imtiaz Ali) చాలా మందికి తెలుసు. ఇతను దీపిక పదుకొనే (Deepika Padukone) , ఆలియా భట్ (Alia Bhatt) లతో పనిచేసి వాళ్ళకి హిట్లు ఇచ్చాడు.
`తమాషా`తో దీపికా పదుకొనే .. ‘హైవే’లో అలియా భట్..లకి హిట్లు ఇచ్చాడు. అవి బాగా ఆడాయి. అయితే ఈ ఇద్దరిలో అలియా వేటినీ కూడా పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించదు. కానీ దీపికా పదుకొనె మాత్రం పలు సందర్భాల్లో ‘ఇంతియాజ్ కి ఇష్టమైన నటి నేనే. అతను నాతోనే కంఫర్ట్ గా పని చేస్తాడు. మా కాంబో ఎప్పుడూ బాగుంటుంది’ అంటూ అభిప్రాయపడింది. కానీ ఒకానొక ఇంటర్వ్యూలో ఇంతియాజ్.. తన ఫేవరెట్ అలియా భట్ అన్నట్టు సమాధానం ఇచ్చి షాకిచ్చాడు.
‘
అసలే దీపికా- అలియా..ల ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతూ ఉంటుంది. ఇలాంటి టైంలో ఇంతియాజ్ కామెంట్స్ పెద్ద హాట్ టాపిక్ అయ్యాయి. దీపికా పాత వీడియోని బయటకి గతంలో ఆమె తన గురించి గొప్పగా చెప్పుకున్న కామెంట్స్ తో.. ట్రోల్ చేస్తున్నారు అలియా అభిమానులు. వాస్తవానికి అలియా- దీపికా..ల మధ్య ఫ్రెండ్షిప్ బాగానే ఉంటుంది. కానీ స్టేట్మెంట్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉంటే.. ఎవరి ఇగోలు దెబ్బతినవు.