‘మేజర్ చంద్రకాంత్’ ‘అడవిలో అన్న’ ‘ఖైదీ గారు’ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మంచు మనోజ్. మోహన్ బాబు కొడుకుగా ఎంట్రీ ఇచ్చినా.. ఆ పేరుని ఎక్కువగా వాడుకోకూడదు అని.. సొంతంగా ఎదగాలని మంచు మనోజ్ కోరిక అని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. మా నాన్న గారు పెద్ద హీరో కథా అని పెద్ద పెద్ద డైరెక్టర్లతో కమర్షియల్ సినిమాలు చేసి స్టార్ గా ఎదగాలని ఎప్పుడూ ప్రయత్నించలేదు.
సొంత బ్యానర్ ఉంది కాబట్టి కొత్త డైరెక్టర్లను.. ట్యాలెంటెడ్ డైరెక్టర్లను పరిచయం చెయ్యాలి అనేదే తన కోరిక అని కూడా మనోజ్ చెప్పాడు. కెరీర్ ప్రారంభంలో ‘దొంగ దొంగది’ ‘బిందాస్’ ‘ఝుమ్మంది నాథం’ వంటి చిత్రాలతో హిట్లు అందుకున్న మనోజ్ … తరువాత ఆ ఫామ్ ను కొనసాగించలేకపోయాడు. అయినా కొత్త కథలు కలిగిన సినిమాలను చేస్తూ మంచి టేస్ట్ ఉన్న హీరో అనిపించుకున్నాడు. ఈరోజు మనోజ్ పుట్టిన రోజు. కొన్నాళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్న మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ చిత్రంతో మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని చూస్తున్నాడు.
అయితే మనోజ్ ను .. కొన్ని సినిమాలు బాగా పెడుతుంటాయట. అవే ‘ప్రయాణం’, ‘నేను మీకు తెలుసా’, ‘మిస్టర్ నూకయ్య’ చిత్రాలు. ‘డిఫరెంట్ సబ్జెక్టుతో తెరకెక్కిన ఈ చిత్రాలు అప్పటి ట్రెండ్ కి సెట్ అవ్వలేదు. ఒకవేళ అవి కనుక ఇప్పుడు విడుదలైతే మంచి ఫలితాల్ని అందుకునేవేమో అని మనోజ్’ బాధపడ్డాడు.
Most Recommended Video
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
తన 19 ఏళ్ళ సినీ కెరియర్ లో ఎన్టీఆర్ వదులుకున్న 12 హిట్ సినిమాలు ఇవే!