మంచు ఫ్యామిలీలో ఉన్న గొడవలు అందరికీ తెలుసు. ఈ క్రమంలో మోహన్ బాబు (Mohan Babu) , విష్ణు (Manchu Vishnu) వర్సెస్ మనోజ్ గా (Manchu Manoj) విడిపోయి.. గొడవ పడ్డారు. విష్ణు పై మనోజ్ కేసు పెడితే… మనోజ్ పై మోహన్ బాబు కేసు పెట్టారు.ఆస్తుల విషయంలో, పెళ్లి విషయంలో మనోజ్.. మోహన్ బాబు, విష్ణు..లకు వ్యతిరేకంగా చేయడం వల్ల అతన్ని కుటుంబం దూరం పెట్టింది. ఆ తర్వాత సందర్భం దొరికిన ప్రతిసారి మనోజ్ ను విష్ణు వేధిస్తున్నట్లు కూడా ప్రచారం జరిగింది.
అటు తర్వాత మనోజ్ ఇంటికి విష్ణు అండ్ టీం వెళ్లి జెనరేటర్లో పంచదార పోయడం, తర్వాత మోహన్ బాబు సినిమాల్లోని డైలాగులతో సోషల్ మీడియాలో ఒకరిని మరొకరు పరోక్షంగా ధూషించుకోవడం అందరికీ తెలిసిందే. ఈ మొత్తం సీన్లో విష్ణు.. ఓ సెక్షన్ ఆఫ్ మీడియాని తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు కూడా చేశాడు. కానీ మోహన్ బాబు స్వయంగా ఓ జర్నలిస్ట్ పై చేయి చేసుకోవడంతో కథ అడ్డం తిరిగింది.
అయినప్పటికీ విష్ణుకి చాలా పలుకుబడి ఉంది. అతని ముందు నిలబడడానికి ఎవ్వరూ సరిపోరు అనేది ఇన్సైడ్ టాక్. అందుకే మనోజ్.. ఇప్పుడు మీడియాని తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు అని స్పష్టమవుతుంది. అతను నటించిన ‘భైరవం’ (Bhairavam) సినిమా మే 30న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఛాన్స్ దొరికిన ప్రతిసారి విష్ణుకి చురకలు అంటిస్తున్నాడు. ‘శివయ్యా’ అంటూ విష్ణు డైలాగ్ తో ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నాడు.
సోషల్ మీడియాలో విష్ణుని ట్రోల్ చేసే బ్యాచ్ ఎక్కువే. వారందరికీ మనోజ్ మరింత స్టఫ్ ఇస్తున్నట్టు అయ్యింది. అలాగే రేపు అనగా మే 20న మనోజ్ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మనోజ్ ముచ్చటించాడు. అలాగే వారికి స్పెషల్ గా లంచ్ కూడా ఏర్పాటు చేశాడు. ప్రస్తుతం అతనికి మీడియానే పెద్ద అండ అని మనోజ్ భావిస్తున్నట్టు స్పష్టమవుతుంది.