Manchu Manoj,Mounika: ఆ సమయంలో బ్రతికి వేస్ట్ అనిపించింది!

మంచు మనోజ్ భూమా మౌనికల వివాహం గత నెల మూడవ తేదీ ఎంతో ఘనంగా అతి కొద్ది మంది సమక్షంలో మంచు లక్ష్మి ఇంట్లో జరిగిన విషయం మనకు తెలిసిందే. గత కొన్ని సంవత్సరాలుగా రిలేషన్ లో ఉంటున్న ఈ జంట పెళ్లి బంధంతో ఒకటయ్యారు.ఇలా పెళ్లి తర్వాత పలు ప్రదేశాలలో తిరుగుతూ సందడి చేస్తున్న మనోజ్ దంపతులు తాజాగా వెన్నెల కిషోర్ హోస్టుగా వ్యవహరిస్తున్న అలా మొదలైంది కార్యక్రమానికి హాజరయ్యారు.

ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమోలో మంచు మనోజ్ వారి లవ్ స్టోరీ గురించి పలు విషయాలను తెలియచేసినట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా మంచు మనోజ్ ప్రేమ గురించి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలు మేము దేశ దేశాలు తిరుగుతూ వనవాసం చేసాము. ఇక మౌనికను వాళ్ళ అమ్మ చనిపోయిన పరిస్థితులలో తనని చూసి తట్టుకోలేకపోయానని తెలిపారు. ఆ సమయంలో మౌనికకు అండగా ఉండకపోతే తాను బ్రతికి వేస్ట్ అని భావించాను.

ఎన్ని డోర్లు మూస్తారు మూయండి అంటూ ఈయన మాట్లాడారు.ఇక రీసెంట్ గా మనోజ్ విష్ణు మధ్య జరిగిన గొడవ గురించి ఈ కార్యక్రమంలో మనోజ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు అర్థం అవుతుంది. ఇక తమ లవ్ ట్రాక్ పై అలా మొదలైంది అంటూ వీరి ప్రేమ గురించి మనోజ్ పలు విషయాలు తెలియజేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో వైరల్ గా మారింది.

అయితే మనోజ్ (Manoj) మౌనిక ప్రేమను గెలిపించుకోవడానికి ఎన్ని కష్టాలు పడ్డారు,తన అన్నయ్య విష్ణుతో గొడవకు గల కారణాలు ఏంటి అనే విషయాల గురించి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే మనోజ్ ఈ విషయాల గురించి ఎలా రియాక్ట్ అయ్యారు ఎలాంటి సమాధానాలు చెప్పారనే విషయం తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus