మౌనిక నా జీవితంలోకి రావడం నా అదృష్టం: మనోజ్

మంచు మనోజ్ మరి కొద్ది రోజులలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయన మార్చి మూడవ తేదీ దివంగత రాజకీయ నాయకుడు భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె మౌనిక రెడ్డితో ఈయన పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇలా భూమా మౌనిక రెడ్డి తో మనోజ్ రెండో పెళ్లి జరగనుందని తెలియడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. గత కొద్దిరోజులుగా వీరిద్దరూ సీక్రెట్ రిలేషన్ లో ఉంటూ తమ రిలేషన్షిప్ మైంటైన్ చేస్తూ వచ్చారు.

అయితే వినాయక చవితి పండుగ సందర్భంగా వీరిద్దరూ కలిసి వినాయకుడి మంటపంలో ప్రత్యేకంగా పూజలు చేయడంతో వీరి గురించి ఒక్కసారిగా వార్తలు వైరల్ అయ్యాయి. అప్పటి నుంచి వీరి పెళ్లి గురించి ఏదో ఒక వార్త వినపడుతూనే ఉంది.అయితే మార్చి మూడవ తేదీ మనోజ్ మౌనికల వివాహం జరగబోతుందని ఇప్పటికే వీరి వివాహానికి సంబంధించి పెళ్లి పనులు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది. మనోజ్ సన్నిహితుల సమాచారం ప్రకారం ఇప్పటికే మనోజ్ పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని,

కేవలం కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగబోతుందని తెలియజేశారు. ఇలా మంచు మనోజ్ రెండో పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడంతో తాజాగా మనోజ్ భూమ మౌనికకు ఉన్నటువంటి రిలేషన్ గురించి మొదటిసారి స్పందించారు. ఈ సందర్భంగా మనోజ్ భూమా మౌనిక గురించి మాట్లాడుతూ మొదట తమ ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉండేదని అయితే ఆ బంధం ప్రేమగా మారిందని తెలిపారు.

కష్ట సమయాలలో తనకు భూమా మౌనిక ఎంతో అండగా నిలిచారని ఆమె తన జీవితంలోకి రావడం తన అదృష్టం అంటూ ఈ సందర్భంగా మనోజ్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus