Manchu Manoj: వారిద్దరి బాధ్యత నాదే.. భరోసా ఇచ్చిన మనోజ్!

మంచు మనోజ్ భూమ మౌనికల వివాహం ఎంతో అంగరంగ వైభవంగా అత్యంత సన్నిహితులు సినీ సెలెబ్రిటీలు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. స్నేహితులుగా ఉన్నటువంటి వీరిద్దరూ ప్రేమలో పడి ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లి తమ ప్రేమను గెలిపించుకున్నారు. ఈ విధంగా మనోజ్ మౌనికల వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే ఈ దంపతులు ఇద్దరికీ ఇది రెండవ వివాహం కావడం కామనార్హం.

ఇదివరకే భూమా మౌనిక బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తను వివాహ మాడారు. అయితే ఈ దంపతులకు ధైరవ్ రెడ్డి అనే ఓ కుమారుడు కూడా ఉన్నారు.ఇలా బాబు పుట్టిన తర్వాత మౌనికకు మనస్పర్ధలు రావడంతో తన భర్త నుంచి వేరుగా ఉన్నారు.ఇక మనోజ్ సైతం ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని పెద్దల సమక్షంలో వివాహం చేసుకొని ఆమెతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా తనకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉన్నారు.

ఇలా వీరిద్దరూ ప్రేమలో పడటం ఆ ప్రేమను విజయవంతంగా పెళ్లి పీటల వరకు తీసుకువెళ్లడం జరిగింది. ఇక మంచు లక్ష్మి మనోజ్ పెళ్లి బాధ్యతలను తన భుజాలపై వేసుకొని దగ్గరుండి తన నివాసంలో ఈ వివాహ వేడుకను జరిపించారు.ఇకపోతే ఎంతో ఘనంగా వీరి వివాహం జరిగిన అనంతరం పెళ్లి తర్వాత మనోజ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.ఈ సందర్భంగా మనోజ్ భూమా మౌనిక చేతులను తన చేతులలోకి తీసుకున్నారు.

వీరిద్దరి చేతులను మరొక చిన్నారి పట్టుకున్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ శివుడి ఆజ్ఞ అంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ పెట్టారు. ఇక ఈ ఫోటో ద్వారా మనోజ్ భూమా మౌనిక తన కుమారుడు ధైరవ్ రెడ్డి బాధ్యత ఇకపై తనదేనంటూ మౌనికకు భరోసా కల్పించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus