మంచు మనోజ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘అహం బ్రహ్మాస్మి’ పవర్ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల!

హీరో మంచు మనోజ్ అదిరిపోయే రీతిలో వెండితెరపై కనిపించేందుకు మళ్లీ వస్తున్నారు. ఇటీవలే ‘అహం బ్రహ్మాస్మి’ అనే మూవీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఒక విలక్షణ పవర్ఫుల్ స్టోరీతో రూపొందే ఈ సినిమా మార్చి 6న గ్రాండ్ గా లాంచ్ కానున్నది. శ్రీకాంత్ ఎన్. రెడ్డి డైరెక్ట్ చేసే ‘అహం బ్రహ్మాస్మి’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మాణమవుతోంది.

బుధవారం ఈ ఫిల్మ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పోస్టర్లో శివభక్తుని తరహాలో మంచు మనోజ్ మూడు అడ్డ విభూది నామాలు, వాటి మధ్యలో నిలువు తిలకం దిద్దుకొని కనిపిస్తున్నారు. ‘వాన్ డైక్’ తరహా గడ్డం, పొడవుగా పెంచిన మీసకట్టుతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. పోస్టర్లో మనోజ్ మూడు రకాల హావభావాలు.. హాస్యం, రౌద్రం, శాంతం.. ప్రదర్శిస్తున్నారు. ‘అహం బ్రహ్మాస్మి’ అనే టైటిల్ కు అద్దం పట్టే విధంగా ఆ లుక్స్ ఉన్నాయి. టైటిల్ డిజైన్ కూడా ఆకర్షణీయంగా ఉంది. ఒక భిన్న థీమ్ తో ఉత్తేజభరితంగా కనిపిస్తున్న ఈ పోస్టర్, సినిమాపై అమితాసక్తిని రేకెత్తిస్తోందనడంలో సందేహమే లేదు. విద్యా నిర్వాణ, మంచు ఆనంద్ సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని ఎంఎం ఆర్ట్స్ బ్యానర్ పై మంచు మనోజ్, నిర్మలాదేవి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం తారాగణం ఎంపిక జరుగుతోంది.

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus