Manchu Manoj: రెండో పెళ్ళి గురించి మంచు మనోజ్ స్పందన ఇది..!

మంచు మనోజ్‌ 2015లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అంగరంగ వైభవంగా మనోజ్ పెళ్ళి జరిగింది. వీరి పెళ్ళి వేడుకకి టాలీవుడ్ నుండీ సినీ ప్రముఖులు, స్టార్లు హాజరయ్యారు. కానీ మనోజ్- ప్రణతి లు నాలుగేళ్ళకే విడిపోయారు. 2019 అక్టోబర్‌లో వీరు విడాకులు తీసుకున్నట్టు మనోజ్ తన సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించాడు. అప్పటి నుండీ మనోజ్ ఒంటరిగానే ఉంటున్నాడు. అయితే అతన్ని కుటుంబ సభ్యులు రెండో పెళ్ళి చేసుకోమని సూచిస్తున్నారని..

ఈ క్రమంలో మనోజ్ ఓ ఫారిన్ అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని భావిస్తున్నట్టు కుటుంబసభ్యులతో చెప్పాడని.. కానీ మోహన్ బాబు ఇందుకు అంగీకరించకుండా తన బంధువుల అమ్మాయిని చూస్తున్నట్టు కథనాలు పుట్టుకొచ్చాయి. ఈ వార్తల పై మనోజ్ తనదైన శైలిలో స్పందించాడు. ‘దయచేసి నా పెళ్ళికి నన్ను కూడా ఆహ్వానిస్తారని కోరుకుంటున్నాను. ఇంతకీ.. పెళ్లి ఎక్కడ.. నేను పెళ్లి చేసుకుంటున్న బుజ్జి పిల్లా తెల్ల పిల్లా ఎవరు? మీ ఇష్టం రా..

అంతా మీ ఇష్టం’ అంటూ బ్రహ్మానందం కామెడీ కామెడీ పిక్ ను పోస్ట్ చేసి ఓ పంచ్ విసిరాడు. మనోజ్ ట్వీట్ పై హీరో నవదీప్ స్పందిస్తూ.. ‘ లేకపోతే నీ ఇష్టం అనుకున్నావా.. మరీ అమాయకుడిలా ఉన్నావే’ అంటూ స్పందించాడు. వీరి సంభాషణకి మనోజ్ అక్క మంచు లక్ష్మీ నవ్వుతున్న ఎమోజిని పెట్టింది. ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus