Manchu Manoj: ఏ జన్మ పుణ్యమో.. అంటూ మనోజ్ ఎమోషనల్ కామెంట్స్.. కారణం?

మంచు మనోజ్‌-మౌనికా రెడ్డిల వివాహం నిన్న ఘనంగా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన బంధు మిత్రులు ఈ వేడుకకు హాజరయ్యారు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు జరిగిన ఈ వివాహ వేడుకలో సినీ పరిశ్రమకు సంబంధించిన స్టార్లు అయితే ఎక్కువ మంది కనిపించలేదు. ఇదిలా ఉండగా.. మంచు మనోజ్ కు ఇది రెండో పెళ్లి అన్న సంగతి తెలిసిందే. గతంలో ఇతను ప్రణతి రెడ్డిని పెళ్లి చేసుకుని.. మనస్పర్థలు రావడంతో విడిపోయాడు.

2019 లో వీరు విడాకులు తీసుకున్నారు. అయితే అధికారికంగా అప్పుడు ప్రకటించారు. దానికి ముందే మనోజ్ – ప్రణతి సెపరేట్ అయ్యారు. అయితే విడాకుల ప్రాసెస్ మాత్రం ఆలస్యం అయ్యిందని తెలుస్తుంది. అప్పటి నుండి మనోజ్ ఒంటరిగా ఉంటున్నాడు. సినిమాలు కూడా చేసింది ఏమీ లేదు. డిప్రెషన్ కు గురయ్యాడు అని మంచు విష్ణు ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. అయితే తర్వాత మామూలు మనిషి అయ్యి సినిమాలు చేద్దాం అనుకుంటే లాక్ డౌన్ వచ్చి ఆ ప్లానింగ్ ను దెబ్బతీసింది.

అయితే కొన్నాళ్ల తర్వాత మనోజ్.. తన స్నేహితురాలు అయిన మౌనిక ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా తన మొదటి భర్తతో విడిపోయింది. ఈ నేపథ్యంలో మనోజ్ – మౌనిక పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని కోరుకున్నారు. కానీ ఇందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ముఖ్యంగా మోహన్ బాబు- మంచు విష్ణు వీరి వివాహానికి అడ్డు చెప్పినట్టు వినికిడి. ఈ క్రమంలో మంచు లక్ష్మీ ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి.. పెళ్లి చేసింది.

తన తమ్ముడిని కొడుకుగా భావిస్తాను అని చాలా సందర్భాల్లో ఆమె చెప్పుకొచ్చింది. మనోజ్ విడాకుల విషయమై పలుమార్లు మీడియా ప్రశ్నించగా.. అతని పర్సనల్ వ్యవహారాలు మీకు ఎందుకు అంటూ మండిపడింది. ఫైనల్ గా తన తమ్ముడు కొత్త జీవితాన్ని ప్రారంభించే వరకు అండగా నిలబడింది.అందుకే ‘ఏ జన్మ పుణ్యమో.. నీలాంటి అక్క లభించింది’ అంటూ మనోజ్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. ఇతని రెండో పెళ్లి క్రెడిట్ అంతా మంచు లక్ష్మీకే చెందుతుందని స్పష్టమవుతుంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus