Manchu Manoj: ‘అన్నయ్యలను ఎక్స్ఛేంజ్ చేసుకుందామా కార్తి?’ .. మంచు విష్ణుని మళ్ళీ కెలికిన మనోజ్
- September 8, 2026 / 08:40 AM ISTByPhani Kumar
కోలీవుడ్ హీరో కార్తి నటిస్తున్న లేటెస్ట్ స్పై థ్రిల్లర్ ‘సర్దార్ 2’. P.S.మిత్రన్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్‌లో మంచు మనోజ్(Manchu Manoj) తెగ సందడి చేశారు. హీరో కార్తి, విలన్ ఎస్.జె.సూర్యతో కలిసి మనోజ్ చేసిన ఫన్నీ ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా బ్రదర్స్ బాండింగ్ గురించి మనోజ్, కార్తి మధ్య జరిగిన సంభాషణ హాట్ టాపిక్ అయ్యింది.
Manchu Manoj

ఇంటర్వ్యూలో మనోజ్ మాట్లాడుతూ.. ‘బ్రదర్స్ అంటే సూర్య, కార్తిలా ఉండాలి. కార్తిని వాళ్ల అన్నయ్య కన్న కొడుకులా చూసుకుంటాడు’ అని పొగడ్తలతో ముంచెత్తాడు. వెంటనే కార్తి నవ్వుతూ.. ‘నువ్వు, విష్ణు కూడా అలాగే ఉంటారా?’ అని సరదాగా అడిగారు. దానికి మనోజ్ ఏమాత్రం ఆలోచించకుండా.. ‘మనం ఒకసారి అన్నయ్యలను ఎక్స్చేంజ్ చేసుకుందామా?’ అంటూ నవ్వుతూ ఫన్నీ ఆఫర్ ఇచ్చాడు. అందుకు కార్తి వెంటనే ‘ఓకే డీల్’ అని నవ్వుతూ చెప్పాడు.
అప్పుడు మనోజ్ ‘ఇక మనోడికి ఉందిలే’ అంటూ చేసిన కామెంట్ అక్కడున్న వాళ్లందరినీ పగలబడి నవ్వేలా చేసింది. గత కొంతకాలంగా మంచు బ్రదర్స్ మధ్య నడుస్తున్న వివాదం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మనోజ్ చేసిన ఈ ఫన్నీ కామెంట్స్.. ఇన్‌డైరెక్ట్‌గా విష్ణుపై వేసిన సెటైర్‌లా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఇక 2022లో బ్లాక్‌బస్టర్ హిట్టైన ‘సర్దార్’ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లరే ఈ ‘సర్దార్ 2’.
ఫస్ట్ పార్ట్‌లో ఆకట్టుకున్న కార్తి, రజిషా విజయన్ ఈ సీక్వెల్‌లోనూ కంటిన్యూ అవుతున్నారు. విలన్‌గా ఎస్.జె.సూర్య.. అలాగే గ్లామర్ డోస్ పెంచేందుకు మాళవిక మోహనన్, ఆశికా రంగనాథ్ కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
కోలీవుడ్‌లో మరోసారి ‘మీటూ’.. చిన్మయిలా మరో సింగర్ వాయిస్ రెయిజ్
















