Manchu Manoj: మంచు మనోజ్ ఉస్తాద్ షోకు హాజరయ్యే ప్రముఖ సెలబ్రిటీలు వేఇళ్లేనా

టాలీవుడ్ హీరోలలో ఒకరైన మంచు మనోజ్ ఒకవైపు సినిమాలతో మరోవైపు టీవీ షోలతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. ఉస్తాద్ పేరుతో మనోజ్ హోస్ట్ చేస్తున్న షో కోసం అభిమానులు ఒకింత ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ షో ప్రసారం కానుండగా ఫస్ట్ ఎపిసోడ్ కు నాని, తర్వాత ఎపిసోడ్లకు రవితేజ, అడివి శేష్ హాజరు కానున్నారని తెలుస్తోంది. మంచు ఫ్యామిలీ సెలబ్రిటీలెవరూ ఇప్పటికైతే ఈ షోలో పాల్గొనడం లేదు.

అయితే ఇలాంటి టాక్ షోలు క్లిక్ కావాలంటే యంగ్ జనరేషన్ స్టార్ హీరోలు, సీనియర్ స్టార్ హీరోలు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే మనోజ్ షోకు ఆ సెలబ్రిటీలు హాజరవుతారో లేదో చూడాల్సి ఉంది. ఈ షో కొరకు ఒకింత భారీ స్థాయిలోనే ఖర్చు చేస్తున్నారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. మంచు మనోజ్ ఈ షోను కచ్చితంగా సక్సెస్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ షో కోసం మనోజ్ కు ఒకింత భారీ స్థాయిలోనే పారితోషికం దక్కిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మనోజ్ నటిస్తున్న వాట్ ద ఫిష్ ప్రాజెక్ట్ పై కూడా అంచనాలు అమాంతం పెరుగుతున్నాయి. మంచు మనోజ్ హీరోగా కూడా మరింత సక్సెస్ సాధించాలని అభిమానులు ఫీలవుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ మనోజ్ కు ఏ స్థాయిలో కలిసొస్తుందో చూడాల్సి ఉంది. మనోజ్ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

అవసరమైతే రాజకీయాల్లోకి వస్తానంటూ (Manchu Manoj) మనోజ్ చేసిన కామెంట్లు సైతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తన భార్య ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయాన్ని తాను సపోర్ట్ చేస్తానని మనోజ్ తెలిపారు. ఇతర భాషల్లో సైతం మనోజ్ సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మనోజ్ రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకుని అభిమానులకు మరింత దగ్గరవుతారేమో చూడాలి.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus