మంచు మనోజ్ (Manchu Manoj) తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కాస్త డిఫరెంట్ గా ముందుకు సాగుతున్నాడు. ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న మనోజ్, తనదైన మాస్ ఇమేజ్‌ను సృష్టించుకున్నాడు. అయితే, వరుస ఫ్లాపుల తర్వాత కొంత విరామం తీసుకున్న అతను, ఇప్పుడు డిఫరెంట్ సినిమాలతో అభిమానులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ‘భైరవం’ (Bhairavam) సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్న మనోజ్, ‘మిరాయ్’లో (Mirai) విలన్‌గా కనిపించనున్నాడు. లేటెస్ట్ గా మనోజ్ మరో కొత్త సినిమాతో వస్తున్నాడని సమాచారం.
‘90 ఎం.ఎల్’ ఫేమ్ శేఖర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ సినిమాకు ‘అత్తరు సాయిబు’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ సూచించినట్లే, ఈ చిత్రం పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఉండనుందని, మనోజ్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్లుగా హాస్యం, యాక్షన్‌తో నిండి ఉంటుందని అంటున్నారు. ఈ సినిమా కథపై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి, ఇప్పుడు అవి ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం.
మే 20న ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉందని టాక్. నిర్మాత, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ సినిమా మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో మరో విజయాన్ని అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మనోజ్ గతంలో మొదలుపెట్టిన ‘అహం బ్రహ్మస్మి’, ‘వాట్ ద ఫిష్’ సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి.
‘భైరవం’ సినిమా షూటింగ్ పూర్తి చేసినప్పటికీ, దాని రిలీజ్ వాయిదా పడింది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas), నారా రోహిత్‌లతో (Nara Rohith) కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఇదొక మినీ మల్టీస్టారర్‌గా హైలెట్ అవుతోంది. ఇక మరోవైపు ‘మిరాయ్’లో విలన్ పాత్రతో వైవిధ్యం చూపనున్న మనోజ్, ఇప్పుడు ‘అత్తరు సాయిబు’తో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు.