పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ … ఇప్పుడు ‘రాజకీయాల్లో ఉంటున్నారు కాబట్టి చాలా వరకూ కోపాన్ని తగ్గించుకున్నానని … నేను పోరాడుతున్న ప్రతీ మనిషి నాకు చాలా ముఖ్యం. నాకు ఓటేసిన వాళ్ళే కాదు ఓటు వెయ్యని వాళ్లు కూడా నాకు ముఖ్యమే’ ఎంతో మెచ్యూర్డ్ గా ముందుకు సాగుతున్నారు. నిజానికి పవన్ నిజ జీవితంలో కూడా ఇంతే ఔన్నత్యం కలిగి ఉంటారు. శ్రీ రెడ్డి, కత్తి మహేష్, పూనమ్ కార్ లాంటి వాళ్లు ఎన్ని కౌంటర్ లు … వేసినా ఆయన రియాక్ట్ అవ్వరు.
కానీ తన కుటుంబం విషయంలో ఎవరైనా కామెంట్స్ చేస్తే విశ్వరూపం చూపిస్తారు పవన్. గతంలో చిరు పై మోహన్ బాబు పై కొన్ని కామెంట్స్ చేస్తే.. అక్కడే ఉన్న పవన్ మైక్ పట్టుకుని.. మోహన్ బాబుని ‘తమ్ముడూ’ అంటూ సెటైర్లు వేసి ముచ్చమటలు పట్టించాడు. ఆ సంఘటన గురించి విష్ణు ని అడిగితే…” చిరంజీవి అంకుల్ కి నాన్నగారికి మంచి స్నేహం ఉంది. వాళ్లు ఎంతో క్లోజ్ గా ఉంటారు. అందుకే నాన్న గారు చిరంజీవి అంకుల్ విషయంలో చాలా ఫ్రీ గా ఏదో ఒకటి అనేస్తుంటారు.
కానీ పవన్ కళ్యాణ్ గారితో అంత సాన్నిహిత్యం లేదు. అప్పట్లో నాన్న గారిని ఆయన ఎందుకు అలా కామెంట్స్ చేశారో నాకు ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్కే..! కానీ ఇప్పటికీ మా రెండు కుటుంబాలు అంతో అన్యోన్యంగా ఉంటాయి.చిరంజీవి అంకుల్ అలాగే నాన్న గారు జీరో నుండీ ఎదిగిన వ్యక్తులు. ఈరోజు మేము ఇలా ఉన్నాము అంటే అది వాళ్లు క్రియేట్ చేసిన ప్లాట్ ఫామ్ వల్లే” అంటూ చెప్పుకొచ్చాడు విష్ణు.