Prabhas, Kannappa: ‘కన్నప్ప’ లో ప్రభాస్ పాత్ర పై స్పందించి క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు!

మంచు విష్ణు (Manchu Vishnu)  ప్రధాన పాత్రలో ‘కన్నప్ప’ (Kannappa)  అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘మహాభారతం’ అనే హిందీ సీరియల్‌ ను డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘అవా ఎంటర్టైన్మెంట్స్’, ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ సంస్థల పై మంచు విష్ణు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna) , బుర్రా సాయి మాధవ్ (Sai Madhav Burra) , తోట ప్రసాద్ వంటి స్టార్స్ ‘కన్నప్ప’ స్క్రిప్ట్ డెవలప్ చేయడం విశేషంగా చెప్పుకోవాలి.

న్యూజిల్యాండ్లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ నటిస్తున్నట్టు చిత్ర బృందం ప్రకటిస్తున్న సంగతి కూడా అందరికీ తెలిసిందే. అక్షయ్ కుమార్ (Akshay Kumar) , శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మోహన్ లాల్ (Mohanlal) వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. అంతేకాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కూడా ‘కన్నప్ప’ లో నటిస్తున్నట్టు చాలా కాలం క్రితమే ప్రచారం మొదలైంది. ఇటీవల చిత్ర బృందం అధికారికంగా ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే.

అయితే ప్రభాస్ ‘కన్నప్ప’ లో ఏ పాత్ర చేస్తున్నాడు అనే విషయం పై మాత్రం ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ముందుగా ఈ సినిమాలో పరమశివుని పాత్రలో ప్రభాస్ నటిస్తున్నట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత నందీశ్వరుడిగా ప్రభాస్ కనిపించబోతున్నట్టు టాక్ నడిచింది. ఇప్పుడైతే ‘అవధూత’ అనే పాత్ర ప్రభాస్ చేస్తున్నట్టు టాక్ మొదలైంది. ఈ క్రమంలో మంచు విష్ణు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయం పై స్పందించారు.

‘మేము ఈ సినిమాలో ఓ పాత్ర కోసం ప్రభాస్ ని అప్రోచ్ అయ్యాము. కానీ ప్రభాస్ కి వేరే పాత్ర నచ్చింది. ‘ఇది నేను చేయొచ్చా’ అని అడిగాడు. అందుకు మేము సంతోషంగా ఓకే చెప్పాము. ఆ పాత్ర ఏంటి అనేది త్వరలోనే రివీల్ చేస్తాము. అంతేకాదు సోమవారం రోజున ఓ మంచి అప్డేట్ కూడా ఉంటుంది’ అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం అతని మాట్లాడిన వీడియో వైరల్ అవుతుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus