Manchu Vishnu: మెగాస్టార్ గరికపాటి వివాదంపై విష్ణు స్పందన ఇదే!

చిరంజీవి గరికపాటి వివాదం విషయంలో ఎక్కువమంది గరికపాటిని తప్పు పట్టారనే సంగతి తెలిసిందే. చిరంజీవి ఎవరిపై విమర్శలు చేయకపోయినా కొంతమంది ఆయనను కావాలనే టార్గెట్ చేస్తుండటంపై నెటిజన్లు సైతం మండిపడ్డారు. కొంతమంది గరికపాటి పాత వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసి ఆయన గురించి తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం గమనార్హం. జిన్నా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి గరికపాటి వివాదం గురించి విష్ణు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

చిరంజీవి గరికపాటి వివాదం విషయంలో అసలేం జరిగిందో నాకు కరెక్ట్ గా తెలియదని విష్ణు అన్నారు. అయితే ఒకటి మాత్రం వాస్తవమని చిరంజీవి గారు లెజెండ్ అని విష్ణు చెప్పుకొచ్చారు. చిరంజీవి లాంటి వ్యక్తి వచ్చిన సమయంలో ఫ్యాన్స్ ఫోటోల కోసం ఎగబడటం సాధారణంగా జరుగుతుందని విష్ణు కామెంట్లు చేశారు. ఫ్యాన్స్ ఉత్సాహాన్ని ఎవరు కంట్రోల్ చేయగలరని విష్ణు అన్నారు. మరోవైపు మంచు విష్ణు జిన్నా సినిమా విషయంలో చాలా ఆశలు పెట్టుకున్నారు.

ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. విష్ణు జిన్నా సినిమా రిలీజ్ కు ముందు ఎలాంటి వివాదాలలో చిక్కుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జిన్నా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు తెలియాల్సి ఉంది. విష్ణు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే కథాంశాన్ని ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్నారు. చిరంజీవి గురించి విష్ణు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విష్ణు జిన్నా సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తే ఆయన భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై కూడా మంచి అంచనాలు ఏర్పడతాయి. సన్నాఫ్ ఇండియా సినిమా విషయంలో జరిగిన తప్పు ఈ సినిమా విషయంలో జరగకుండా మేకర్స్ జాగ్రత్త పడుతున్నారు. విష్ణు ఎక్కువగా సొంత బ్యానర్ లో తెరకెక్కే సినిమాలలో నటిస్తున్నారు. విష్ణు కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus